‘అర్జున్‌ సురవరం’ మూవీ రివ్యూ..నిఖిల్ హిట్ బొమ్మతో వచ్చాడు

టైటిల్‌: అర్జున్‌ సురవరం నటీనటులు: నిఖిల్‌, లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్‌, పోసాని కృష్ణమురళీ, సత్య… దర్శకత్వం: టీఎన్‌ సంతోష్‌ సంగీతం: సామ్‌ సీ.ఎస్‌ సమర్పణ: ‘ఠాగూర్‌’ మధు నిర్మాత: రాజ్‌కుమార్‌ ఆకెళ్ల ఇంట్రో: ‘హ్యాపీడేస్’ చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన నిఖిల్, రోజురోజుకు తన స్థాయిని పెంచుకుంటూ హీరోగా రాణిస్తున్నాడు. ఇటీవల ఎంచుకున్న స్క్రిప్ట్‌లు నిఖిల్‌కు సపరేట్ మార్కెట్‌ని తెచ్చిపెట్టాయి. మనోడి సినిమా వస్తుందంటే చూసేందుకు ఆడియెన్స్ థియేటర్స్‌కు క్యూ కడుతున్నారు. తాజాగా ‘అర్జున్‌ సురవరం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ […]

'అర్జున్‌ సురవరం' మూవీ రివ్యూ..నిఖిల్ హిట్ బొమ్మతో వచ్చాడు
Follow us

| Edited By:

Updated on: Nov 29, 2019 | 3:31 PM

టైటిల్‌: అర్జున్‌ సురవరం నటీనటులు: నిఖిల్‌, లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్‌, పోసాని కృష్ణమురళీ, సత్య… దర్శకత్వం: టీఎన్‌ సంతోష్‌ సంగీతం: సామ్‌ సీ.ఎస్‌ సమర్పణ: ‘ఠాగూర్‌’ మధు నిర్మాత: రాజ్‌కుమార్‌ ఆకెళ్ల

ఇంట్రో:

‘హ్యాపీడేస్’ చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన నిఖిల్, రోజురోజుకు తన స్థాయిని పెంచుకుంటూ హీరోగా రాణిస్తున్నాడు. ఇటీవల ఎంచుకున్న స్క్రిప్ట్‌లు నిఖిల్‌కు సపరేట్ మార్కెట్‌ని తెచ్చిపెట్టాయి. మనోడి సినిమా వస్తుందంటే చూసేందుకు ఆడియెన్స్ థియేటర్స్‌కు క్యూ కడుతున్నారు. తాజాగా ‘అర్జున్‌ సురవరం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ యంగ్ హీరో. తమిళ సూపర్‌హిట్‌ చిత్రం ‘కణితన్‌’కు  రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. వాస్తవానికి చాలా నెలల క్రితమే మూవీ  రిలీజ్‌ కావాల్సి ఉన్నా.. అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. రీసెంట్‌గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి రావడంతో సినిమాకి ఒక్కసారిగా బజ్ పెరిగిపోయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు అలరించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ:

అర్జున్ లెనిన్ సురవరం( నిఖిల్ ) జర్నలిజంపై మక్కువతో..సాప్ట్‌వేర్ జాబ్ వదిలేసి.. టీవీ99 అనే ఛానల్‌లో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా జాయిన్ అవుతాడు. ఎప్పటికైనా బీబీసీలో పనిచెయ్యాలన్నది అతని డ్రీమ్. ఒక స్ట్రింగ్ ఆపరేషన్  మధ్యల  అర్జున్‌కి కావ్య(లావణ్య త్రిపాఠి) పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతోంది.  తాను బీబీసీలో పనిచేస్తున్నాని చెప్పి అబద్దం చెప్పడంతో..కావ్య హర్ట్ అయ్యి అర్జున్ దూరం పెడుతుంది. కానీ అతనపై ఉన్న సాప్ట్ కార్నర్ వల్ల ..బీబీసీకి అర్జున్ రెజ్యూమ్‌ని కావ్యనే పంపుతుంది. అలా  బీబీసీలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గాా అర్జున్ జాబ్ సంపాదిస్తాడు. మళ్లీ లవ్ ట్రాక్ ఎక్కుతోన్న సమయంలో ఫోర్జరీ డాక్యుమెంట్స్‌తో పాటు ఎడ్యుకేషన్‌ లోన్స్‌ పేరిట బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో స్కామ్ చేశాడన్న అభియోగాలతో అర్జున్‌ని అరెస్ట్ చేస్తారు. అతనితో చాలా మంది ఈ స్కామ్‌లో ఇరుక్కుంటారు. అభియోగాల వల్ల అందులో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడు. అదే సమయంలో నిఖిల్ బెయిల్‌పై బయటకు వస్తాడు. అసలు ఈ నకిలీ సరిఫికేట్స్ వ్యవహారం ఏంటి? దానితో అర్జున్‌కి ఏంటి సంబంధం? దానివెనుక ఉన్నది ఎవరు? అర్జున్ వాళ్ళను పట్టుకోగలిగాడా అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: 

కనితన్‌కి రీమేక్‌గా తెరకెక్కించినా తెలుగులో చాలా మార్పులు చేశారు. సినిమా రిలీజ్ చాలా ఆలస్యమైనా, హిట్ మోత మాత్రం సాలిడ్‌గా వినిపిస్తోంది. ఫేక్‌ సర్టిఫికెట్స్‌ వల్ల జరిగే అనర్థాలను ఈ చిత్రంలో చక్కగా చూపించగలిగారు. ఫస్టాప్ అంతా అదిరిపోయే ట్విస్టులతో, ఉత్కంఠగా సాగే స్క్రీన్ ప్లేతో ఆద్యంతం అలరిస్తుంది. సెకండాఫ్ కాస్త స్లో అనిపిస్తుంది. వెన్నెల కిషోర్‌, సత్య కామెడీ బాగా పండింది. కొన్నిచోట్ల సినిమాటిక్ ఫ్రీడమ్ కాస్త ఎక్కువగా తీసుకున్నారు. క్లైమాక్స్ కూడా కాస్త హడావిడిగా ముగిసినట్టు అనిపిస్తుంది. ఇంకొంచెం శ్రద్ద వహించి ఉంటే సినిమా రేంజ్ మరో స్థాయికి వెళ్లేది.

ఎలా చేశారంటే :

ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌ పాత్రలో నిఖిల్ చాలా సెటిల్డ్‌గా నటించాడు. హీరోయిన్ పాత్రకి కూడా సినిమాలో చాలా వెయిట్ ఉంది. లావణ్య త్రిపాఠి ఆ పాత్రకు సంపూర్ణంగా న్యాయం చేసింది. తన రేంజ్‌ను దాటి హీరోయిజం ఎలివేట్ చేసే ప్రయత్నం నిఖిల్ చెయ్యలేదు. అన్ని పాత్రలను కలుపుకుని వెళ్లాడు. పోసాని కృష్ణమురళీ, వెన్నెల కిశోర్, సత్య, విద్యుల్లేఖ  లాంటి యాక్టర్లు సినిమా పరిధిని మరింత విస్తరించారు.

సాంకేతిక విభాగం:

డైరెక్టర్  సంతోష్ తెలుగు వెర్షన్‌ని కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేసి హిట్ అందుకున్నాడనే చెప్పాలి. నేపధ్య సంగీతంతో అదరగొడుతోన్న సామ్ సిఎస్ మరోసారి తన మ్యాజిక్ రిపీట్ చేశాడు.  ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు విషయంలో కూడా ఎక్కడా రాజీ పడలేదు.

ప్లస్ పాయింట్స్

కథ కథనం ట్విస్టులు ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్:

స్లో సెకండాఫ్ ఓవర్ సినిమాటిక్ ఫ్రీడం

ఫైనల్ థాట్ : నిఖిల్ ఖాతాలో మరో మ్యాజికల్ హిట్

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు