Ileana D’Cruz: ఇలియానా జీవితంలో ఈ మిస్టరీ మ్యాన్ ఎవరు ?.. ఎట్టకేలకు అతని ఫోటో రివీల్ చేసింది..
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. ఇటీవల తాను ప్రెగ్నెంట్ అంటూ ప్రకటించి షాకిచ్చింది. అంతేకాదు.. ఎప్పటికప్పుడు బేబీ బంప్ ఫోటోస్ షేర్ చేస్తూ తెగ సంతోషపడిపోతుంది. దీంతో ఆమె భర్త ఎవరు ? ఇంతకీ ఎప్పుడూ పెళ్లి చేసుకుంది? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పటివరకు తన భర్త ఎవరనేది బయటపెట్టలేదు ఇలియానా.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది ఇలియానా. దేవదాసు సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇటు టాలీవుడ్ మాత్రమే కాకుండా.. బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఎక్కువగానే ఆఫర్స్ రావడంతో తెలుగు తెరకు దూరమైంది. అటు హిందీలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ.. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. ఇటీవల తాను ప్రెగ్నెంట్ అంటూ ప్రకటించి షాకిచ్చింది. అంతేకాదు.. ఎప్పటికప్పుడు బేబీ బంప్ ఫోటోస్ షేర్ చేస్తూ తెగ సంతోషపడిపోతుంది. దీంతో ఆమె భర్త ఎవరు ? ఇంతకీ ఎప్పుడూ పెళ్లి చేసుకుంది? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పటివరకు తన భర్త ఎవరనేది బయటపెట్టలేదు ఇలియానా.
తాజాగా తన మిస్టరీ బాయ్ ఫ్రెండ్ గురించి రివీల్ చేసింది. ఇలియానా ప్రస్తుతం తన బేబీమూన్‌లో బీచ్‌లో ఉంది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వ్యక్తితో చేతులు పట్టుకుని ఉన్న చిత్రాన్ని షేర్ చేసింది. అతడితో కలిసి డిన్నర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఫోటోలో వ్యక్తి ముఖం మాత్రం కనిపించలేదు. అంతేకాకుండా.. ఆ ఫోటోలో ఇద్దరి వేళ్లకు ఉంగరాలు కనిపిస్తున్నాయి. దీంతో వీరిద్దరి నిశ్చితార్థం జరిగిపోయినట్లు తెలుస్తుండగా.. ‘నా రొమాన్స్ ఆలోచన తనని ప్రశాంతంగా తిననివ్వదు’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.
ఏప్రిల్ 18న ఇలియానా తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో రెండు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను షేర్ చేసింది. మొదటి ఫోటో, ‘అందుకే సాహసం మొదలవుతుంది” అనే పదాలతో కూడిన అందమైన పిక్ షేర్ చేయగా.. ” మరో ఫోటోలో ‘అమ్మా’ అని రాసి ఉన్న లాకెట్టు ధరించిన తన పిక్ షేర్ చేసింది. అలాగే.. “త్వరలో వస్తున్నాను. నిన్ను కలవడానికి వేచి ఉండలేను మై లిటిల్ డార్లింగ్” అనే క్యాప్షన్‌తో ఆ ఫోటోస్ షేర్ చేసింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.