AP Polycet 2026 Last Date: ఏపీ పాలిసెట్ 2026కు దరఖాస్తు చేశారా? మరికొన్ని గంటల్లో ముగుస్తున్న గడువు
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'పాలిసెట్-2026' దరఖాస్తు గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు గురువారం (ఏప్రిల్ 9, 2026)తో ముగియనుంది. ఆసక్తి కలిగిన..

అమరావతి, ఏప్రిల్ 8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ‘పాలిసెట్-2026’ దరఖాస్తు గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు గురువారం (ఏప్రిల్ 9, 2026)తో ముగియనుంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు ముగింపు గడువులోగా ఆన్‌లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణామండలి అధికారులు సూచించారు.
ఏపీ పాలిసెట్ 2026 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పదోతరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్దులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ప్రస్తుత విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.400, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.100 చొప్పున దరఖాస్తు రుసుము చెల్లించవల్సి ఉంటుంది. పాలీసెట్ 2026 ర్యాంకు ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లోని ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ డిప్లొమా సీట్లను భర్తీ చేస్తారు. ఇక పాలీసెట్ 2026 ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. ఈ పరీక్ష ఫలితాలు మే 10, 2026వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది.
ఏపీ పాలిసెట్ 2026 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రాత పరీక్ష విధానం..
పాలీసెట్ పరీక్ష మొత్తం 120 ప్రశ్నలకు 120 మార్కులకు ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్ విభాగం నుంచి 50 ప్రశ్నలు, ఫిజిక్స్ విభాగం నుంచి 40 ప్రశ్నలు, కెమిస్ట్రీ విభాగం నుంచి 30 ప్రశ్నలు చొప్పున అడుగుతారు. ప్రశ్నలు పదో తరగతి సిలబస్ నుంచి అడుగుతారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




