AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: ఈ సెంటిమెంట్ వర్కవుట్ అయితే భోళా శంకర్‌ బ్లాక్ బాస్టర్ అంతే

భోళా శంకర్‌కు ఆ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా..? అప్పట్లో మెగాస్టార్‌కు బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన ఆ సెంటిమెంట్ ఇప్పుడు భోళాకు కలిసొస్తుందా..? చిరంజీవికి గతంలో 100 పర్సెంట్ సక్సెస్ ఇచ్చిన ఖతర్నాక్ సెంటిమెంట్.. మెహర్ రమేష్‌కు ఫస్ట్ బ్లాక్‌బస్టర్ ఇస్తుందా..? ఇంతకీ మెగా ఫ్యాన్స్‌ను అంతగా ఊరిస్తున్న ఆ బ్లాక్‌బస్టర్ సెంటిమెంట్ ఏంటి..?

Chiranjeevi: ఈ సెంటిమెంట్ వర్కవుట్ అయితే భోళా శంకర్‌ బ్లాక్ బాస్టర్ అంతే
Bhola Shankar
Ram Naramaneni
|

Updated on: May 04, 2023 | 7:00 PM

Share

ఇండస్ట్రీలో అన్నింటికంటే ఎక్కువగా నమ్మేది సెంటిమెంట్‌నే. వర్కవుట్ అయ్యే సెంటిమెంట్ వైపు అందరి అడుగులు పడుతుంటాయి. ఇప్పుడు చిరంజీవి భోళా శంకర్‌కు కూడా ఇదే జరుగుతుంది. ఇందులో చిరు టాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నారు. మే డే సందర్భంగా విడుదలైన స్టిల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. చిరంజీవి స్టీరింగ్ పట్టిన ప్రతీసారి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిసింది. అది ఆటో అయినా.. లారీ అయినా.. టాక్సీ అయినా..! ఆయన స్టీరింగ్ తిప్పారంటే మరో డౌట్ లేకుండా బొమ్మ బ్లాక్‌బస్టర్ అని ఫిక్సైపోతారు ఫ్యాన్స్. తాజాగా భోళా శంకర్‌లోనూ చిరు టాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నారు. అప్పట్లో ఇంద్రలోనూ టాక్సీ నడిపిన చిరు.. అన్నయ్యలో లారీ డ్రైవర్‌గా నటించారు.

90ల్లోనూ చిరంజీవికి స్టీరింగ్ బాగానే కలిసొచ్చింది. రౌడీ అల్లుడులో ఆటో జానీగా అదరగొట్టారు మెగాస్టార్. అందులో ఆయన గెటప్ ప్లస్ డైలాగ్స్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. గ్యాంగ్ లీడర్‌లోనూ టాక్సీ డ్రైవర్‌గా నటించారు చిరంజీవి. అందులో విజయశాంతితో వచ్చే సీన్స్ ఎప్పటికీ మరిచిపోలేం. ఇలా ఒకటి రెండు కాదు.. చిరు స్టీరింగ్ తిప్పిన ప్రతీసారి కాసుల వర్షం కురిసింది. ఇదే సెంటిమెంట్ భోళా శంకర్‌కు వర్కవుట్ అవుతుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్. ఆగస్ట్ 11న ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉందీ సినిమా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు