AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: ఇట్స్ అఫీషియల్.. క్రేజీ కాంబో రిపీట్.. నాలుగోసారి గురుజీతో ఐకాన్ స్టార్..

ఈ మూడు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ జులాయి. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో సినిమాలు ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Allu Arjun: ఇట్స్ అఫీషియల్.. క్రేజీ కాంబో రిపీట్.. నాలుగోసారి గురుజీతో ఐకాన్ స్టార్..
Allu Arjun
Rajeev Rayala
|

Updated on: Jul 03, 2023 | 11:15 AM

Share

సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ గా ఉంటాయి. అభిమానులు కూడా అదే కాంబినేషన్ రిపీట్ కావాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి కంబోనే త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్. ఈ క్రేజీ కాంబో నుంచి ఇప్పటికే మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ మూడు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ జులాయి. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో సినిమాలు ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి మరో సినిమా చేయబోతున్నారు. అల్లు అర్జున్ కెరీర్ లో 22 వ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

హారిక అండ్ హాసిని, గీత ఆర్ట్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈసారి అంతకు మించి పెద్ద సినిమాతో రాబోతున్నాం అని తెలిపారు మేకర్స్. దాంతో అభిమానుల్లో ఆనందం రెట్టింపైంది. ఈ సినిమా ఎలా ఉండబోతుంది. ఈసారి అల్లు అర్జున్ ను త్రివిక్రమ్ ఎలా చూపిస్తారు అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబుతో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కానుంది. అటు అల్లు అర్జున్ పుష్ప 2తో బిజీగా ఉన్నాడు. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పుష్ప కు కొనసాగింపుగా రానుంది.