విడాకుల తర్వాత స్వేచ్ఛ వచ్చింది

మాజీ భర్త అర్బాజ్ ఖాన్‌తో విడాకులు తీసుకున్న తర్వాత స్వేచ్ఛ వచ్చిందని బాలీవుడ్ నటి మలైకా అరోరా అన్నారు. సల్మాన్ ఖాన్ సోదరుడైన అర్బాజ్ ఖాన్‌తో ఆమెకు 1998లో వివాహం జరిగింది. దాదాపు 19 ఏళ్లు ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరికి 16ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల 2017లో వీరు విడాకులు తీసుకున్నారు. అర్బాజ్ నుంచి విడిపోవడం గురించి మలైకా తాజాగా మాట్లాడింది. అర్బాజ్‌కు విడాకులు ఇవ్వడంతో ఇప్పుడు స్వేచ్ఛగా, నచ్చినట్లుగా జీవిస్తున్నానని […]

  • Tv9 Telugu
  • Publish Date - 6:25 am, Wed, 13 March 19
విడాకుల తర్వాత స్వేచ్ఛ వచ్చింది

మాజీ భర్త అర్బాజ్ ఖాన్‌తో విడాకులు తీసుకున్న తర్వాత స్వేచ్ఛ వచ్చిందని బాలీవుడ్ నటి మలైకా అరోరా అన్నారు. సల్మాన్ ఖాన్ సోదరుడైన అర్బాజ్ ఖాన్‌తో ఆమెకు 1998లో వివాహం జరిగింది. దాదాపు 19 ఏళ్లు ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరికి 16ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల 2017లో వీరు విడాకులు తీసుకున్నారు. అర్బాజ్ నుంచి విడిపోవడం గురించి మలైకా తాజాగా మాట్లాడింది.

అర్బాజ్‌కు విడాకులు ఇవ్వడంతో ఇప్పుడు స్వేచ్ఛగా, నచ్చినట్లుగా జీవిస్తున్నానని చెప్పింది మలైకా. మనకు కావాల్సింది మనం ఎంచుకుంటేనే బావుంటుందని ఆమె తెలిపింది. జీవితాంతం ఒంటరిగా ఉండాలని ఎవరూ అనుకోరని చెప్పింది. మరోవైపు మలైకా, నటుడు అర్జున్ కపూర్‌తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు జంటగా తరచూ బయట కనిపిస్తున్నారు. ఇరు కుటుంబాల్లో జరిగే ఫంక్షన్స్‌కు హాజరవుతున్నారు. త్వరలోనే వీరి పెళ్లి జరగనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.