ఆర్ఆర్ఆర్ పుకార్లు: మీడియా ముందుకు జక్కన్న

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుపుకుంటోన్న ఈ మూవీపైఎన్నో రూమర్లు నడుస్తున్నాయి. ముఖ్యంగా హీరోయిన్లు, ఇతర నటులు, కథ విషయంలో రోజుకో వార్త వినిపిస్తోంది. దీంతో వాటిపై క్లారిటీ ఇవ్వాలని రాజమౌళి అనుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈ గురువారం రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టనున్నాడు. అందులో రూమర్లపై ఆయన స్పందించనున్నట్లు తెలుస్తోంది కాగా 300కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీని తదుపరి షెడ్యూల్‌ను […]

  • Tv9 Telugu
  • Publish Date - 10:59 am, Tue, 12 March 19
ఆర్ఆర్ఆర్ పుకార్లు: మీడియా ముందుకు జక్కన్న

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుపుకుంటోన్న ఈ మూవీపైఎన్నో రూమర్లు నడుస్తున్నాయి. ముఖ్యంగా హీరోయిన్లు, ఇతర నటులు, కథ విషయంలో రోజుకో వార్త వినిపిస్తోంది. దీంతో వాటిపై క్లారిటీ ఇవ్వాలని రాజమౌళి అనుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈ గురువారం రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టనున్నాడు. అందులో రూమర్లపై ఆయన స్పందించనున్నట్లు తెలుస్తోంది

కాగా 300కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీని తదుపరి షెడ్యూల్‌ను కోల్‌కతాలో ప్లాన్ చేశారు. దాదాపు 45రోజుల పాటు అక్కడ షూటింగ్ జరగనుండగా.. కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు లవ్ ట్రాక్‌ను కూడా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలో రానున్న ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా.. కీరవాణి సంగీతం అందిస్తోన్న విషయం తెలిసిందే.