Hyper Aadi: ఢీ షో కావాలా..? పవన్ కళ్యాణ్ కావాలా.? అని అన్నారు.. హైపర్ ఆది ఇంట్రెస్టింగ్ కామెంట్స్
స్టార్ యాక్టర్ ధనుష్, సంయుక్త మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం ‘సార్’. ఈ సినిమా తమిళ్ లో ‘వాతి’ అనే టైటిల్ తో రిలీజ్ కానుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. స్టార్ యాక్టర్ ధనుష్, సంయుక్త మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ధనుష్ నటించిన తొలి తెలుగు సినిమా కావడంతో ‘సార్’ పై తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ధనుష్, సంయుక్త మీనన్, దర్శకుడు వెంకీ అట్లూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ.. ” ధనుష్ గారి సినిమాల్లో రఘువరన్ బి.టెక్ తర్వాత తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే సినిమా సార్. అద్భుతంగా ఉంటుంది ఈ సినిమా. ఒక తెలుగు యువ దర్శకుడు తమిళ స్టార్ కి కథ చెప్పి ఒప్పించాడంటే తెలుగు ప్రేక్షకులు గర్వంగా ఈ సినిమా చూడాలి. అలాగే పాపులర్ స్టార్ అయ్యుండి కథ నచ్చి మూడు సినిమాల అనుభవమున్న దర్శకుడికి అవకాశమిచ్చాడంటే తమిళ ప్రేక్షకులు గర్వంగా ఈ సినిమా చూడాలి. తెలుగు, తమిళ ప్రేక్షకులందరూ మెచ్చేలా ఉంటుంది ఈ సినిమా. తప్పకుండా ఫిబ్రవరి 17న థియేటర్లకి వెళ్లి చూడండి” అన్నారు. అలాగే ప్రొడ్యూసర్ నాగవంశీ గురించి మాట్లాడుతూ.. భీమ్లానాయక్ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ గారితో ఒక పాట చేశాను.. అదే సమయంలో ఢీ షూటింగ్ కు వెళ్లాలని ఆయనకు ఫోన్ చేస్తే ఢీ కావాలా ..? పవన్ కళ్యాణ్ కావాలా అని అడిగారు అంటూ చెప్పుకొచ్చాడు ఆది. ఆ టైం లో రెండు చేతులు జేబులో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి సాంగ్ షూటింగ్ కు వెళ్ళాను అని అన్నాడు ఆది. ఇక చివరిలో ధనుష్ చిత్రంలో నటించిన స్టూడెంట్స్, టీమ్ తో కలసి చిత్రంలోని ‘ మాస్టారు… మాస్టారు’ గీతం ఆలపించి అభిమానుల సంతోషాన్ని అంబరాన్ని తాకేలా చేశారు.
