AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘తెలంగాణ దేవుడు’ చిత్రం పెద్ద విజయం సాధించాలి: హోం మినిస్టర్ మొహమ్మద్ అలీ

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి జీవితం ఓ స్ఫూర్తి ప్రదాయకం. తెలంగాణ ఉద్యమం భావి తరాలకు ఓ నిఘంటువు.1969 నుండి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలోని పరిస్థితులను చూసి చలించి

‘తెలంగాణ దేవుడు’ చిత్రం పెద్ద విజయం సాధించాలి: హోం మినిస్టర్ మొహమ్మద్ అలీ
Rajeev Rayala
|

Updated on: Apr 20, 2021 | 6:14 AM

Share

Home minister Mahmood Ali : తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి జీవితం ఓ స్ఫూర్తి ప్రదాయకం. తెలంగాణ ఉద్యమం భావి తరాలకు ఓ నిఘంటువు.1969 నుండి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలోని పరిస్థితులను చూసి చలించి ఉద్యమాన్ని ముందుకు నడిపించి ప్రజల కష్టాలను తీర్చిన ఒక మహానీయుని జీవిత చరిత్రే ‘తెలంగాణ దేవుడు’. ఫ్రెండ్లీ స్టార్‌ శ్రీకాంత్ టైటిల్‌ పాత్రలో జిషాన్ ఉస్మాన్ హీరోగా , హీరోయిన్ సంగీత, బ్రహ్మానందం, సునీల్, సుమన్, తనికెళ్ళ భరణి, బ్రహ్మాజీ, మధుమితతో పాటు 50 మంది అగ్ర తారాగణం ఈ చిత్రంలో నటించారు. వడత్య హరీష్ దర్శకత్వంలో మ్యాక్స్‌ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ హోం శాఖా మంత్రి వర్యులు మొహమ్మద్ అలీ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మహమ్మద్ అలీ మాట్లాడుతూ… ‘‘తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము అంటే దానికి ముఖ్య కారణం కేసీఆర్ గారు. అందరికీ తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా అభివృద్ధి చేస్తారనే డౌట్ ఉండేది. తెలంగాణ రాకముందు కేసీఆర్‌గారు పార్లమెంట్‌లో రిప్రజెంట్ చేసి ఎంపీలను, 36 పార్టీల ప్రెసిడెంట్‌లను కలిసి రిక్వెస్ట్ చేస్తే అందరూ కూడా తెలంగాణ చాలా వెనుకబడింది. మీ దగ్గర పవర్ లేదు, ఫార్మర్స్ సూసైడ్ చేసుకొంటున్నారు, ల్యాండ్ ఆర్డర్ బాగాలేదు మీరెలా అభివృద్ధి చేస్తారని అందరూ క్వశ్చన్ చేశారు. తెలంగాణ సాధించిన తర్వాత ఈ రోజు అన్ని రంగాలను ప్రగతి పథంలో తీసుకెళుతూ కేసీఆర్‌గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. 2002 చంద్రబాబు పాలనలో రైతులు రెండు గంటల కరెంట్ ఎక్కువ కావాలని దీక్ష చేస్తూ.. ప్రభుత్వాన్నీ నిలదీస్తే ఫైరింగ్ చేసి పది మంది రైతుల మరణానికి కారణమైనాడు. అలాంటిది ప్రస్తుతం రైతులకు రైతు భీమా ఏర్పాటు చేసి వారికి కేసీఆర్‌గారు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారు. అలాగే పవర్‌ విషయంలో తెలంగాణ నెంబర్ వన్‌లో ఉంది. ఫ్లోరైడ్ నీరు ఎక్కువ ఉండే నల్గొండలో ఇంటింటికి మంచి నీరిచ్చారు. ఇలా అందరికీ మంచి చేసుకుంటూ కేసీఆర్‌ను వంకపెట్టే ఛాన్స్ ఇవ్వకుండా తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ స్టేట్‌గా తీసుకువచ్చారు. ఎంతో కష్టపడి తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ బయోపిక్‌కు ‘తెలంగాణ దేవుడు’ టైటిలే కరెక్ట్‌గా సూట్ అయ్యింది. తెలంగాణ ఉద్యమం గురించి తెలియజేసే సినిమా ఫంక్షన్‌కు మమ్మల్ని ఆహ్వానించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. వారికి ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను..’’ అని అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Karthika Deepam: కార్తీక్ నిజంగా మారాడా.. లేక జాలిపడుతున్నాడా అని ఆలోచిస్తున్న సౌందర్య.. మోనిత శనిలా పట్టుకుందన్న భాగ్యం