
‘కాంతార: చాప్టర్ 1’ చిత్రంలో పనిచేస్తున్న జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ఇటీవల ప్రమాదవశాత్తూ మరణించాడు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే కపిల్ మరణించాడంటూ వార్తలు వచ్చాయి. ఈ సంఘటనకు సంబంధించి నిర్మాణ సంస్థ ‘హోంబాలే ఫిల్మ్స్’ వివరణ ఇచ్చింది . కపిల్ మరణించిన రోజున ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా షూటింగ్ జరగలేదని నిర్మాతలు స్పష్టం చేశారు. ‘ఎం.ఎఫ్. కపిల్ మృతికి మా ప్రగాఢ సానుభూతి. ఆయన కుటుంబానికి, ఆయన సన్నిహితులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తి లభించాలని ప్రార్థిస్తున్నాము. ఈ క్లిష్ట సమయంలో వారికి మా సానుభూతి. ఇదే సందర్భంగా ఈ సంఘటన కాంతారా సెట్‌లో జరగలేదని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాం. ఆ రోజు షూటింగ్ షెడ్యూల్ లేదు. కపిల్ మరణానికి కాంతార 2 షూటింగ్ కు సంబంధం లేదు. దయ చేసి ఈ సంఘటనను కాంతారా 2 చిత్ర బృంద సిబ్బందితో ముడిపెట్టవద్దని మేము అభ్యర్థిస్తున్నాం’ అని ‘హోంబాలే ఫిల్మ్స్’ లేఖలో స్పష్టం చేసింది.
రిషబ్ శెట్టి కాంతారా 2 చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రను కూడా పోషిస్తున్నాడు. మే 6న కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ నీటిలో మునిగి మరణించాడు. ఉడిపి జిల్లా బైందూర్ లోని కొల్లూరులో ఈ ఘటన జరిగింది. కపిల్ తన బృందంతో కలిసి కొల్లూరులోని సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లాడు. నీటి లోతు తెలియకనే వారు నదిలోకి దిగడంతో ఊపిరాడక అతను చనిపోయాడు. ఆ సమయంలో అతను నీటిలో మునిగి చనిపోయాడు. అయితే ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా షూటింగ్ సమయంలో జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ మరణించి ఉండవచ్చని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు నిర్మాతల నుండి అధికారిక స్పష్టత వచ్చింది. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
We extend our heartfelt condolences to the family of M.F. Kapil, may they find strength and peace in this difficult time.
ಎಂ.ಎಫ್. ಕಪಿಲ್ ಅವರ ಅಗಲಿಕೆಯಿಂದ ನಮಗೆ ತೀವ್ರ ದುಃಖವಾಗಿದೆ. ಅವರ ಕುಟುಂಬಕ್ಕೆ ನಮ್ಮ ಸಂತಾಪಗಳು…🙏🏼 pic.twitter.com/mG6JPLVC6m
— Hombale Films (@hombalefilms) May 8, 2025
𝐓𝐇𝐄 𝐌𝐎𝐌𝐄𝐍𝐓 𝐇𝐀𝐒 𝐀𝐑𝐑𝐈𝐕𝐄𝐃 🔥
𝐓𝐇𝐄 𝐃𝐈𝐕𝐈𝐍𝐄 𝐅𝐎𝐑𝐄𝐒𝐓 𝐖𝐇𝐈𝐒𝐏𝐄𝐑𝐒 🕉️#KantaraChapter1 Worldwide Grand Release on 𝐎𝐂𝐓𝐎𝐁𝐄𝐑 𝟐, 𝟐𝟎𝟐𝟓.#KantaraChapter1onOct2 #Kantara@shetty_rishab @VKiragandur @hombalefilms @HombaleGroup @ChaluveG… pic.twitter.com/VoehP4xW96— Hombale Films (@hombalefilms) November 17, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.