AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR: ఉక్రెయిన్‌‌‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఆర్ఆర్ఆర్.. ఫోటో షేర్ చేసిన హాలీవుడ్ హీరోయిన్

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్‌‌‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్,

RRR: ఉక్రెయిన్‌‌‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఆర్ఆర్ఆర్.. ఫోటో షేర్ చేసిన హాలీవుడ్ హీరోయిన్
Rrr
Rajeev Rayala
|

Updated on: Aug 08, 2021 | 6:05 PM

Share

RRR: దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్‌‌‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు వీరులను కలిపి ఈ సినిమాలో చూపించనున్నాడు జక్కన్న. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరిసీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్‌‌‌గా తారక్ కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఉక్రెయిన్‌‌‌లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ సరసన ఆలియా భట్, ఎన్టీఆర్‌‌‌కు జోడీగా హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్‌‌‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌‌‌లో జరుగుతోన్న షూటింగ్‌‌‌‌లో ఒలీవియా పాల్గొంది. తారక్, ఒలీవియాల మధ్య ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. దానికి సంబంధించిన ఓ ఫొటోను ఒలీవియా తన ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌లో అభిమానులతో పంచుకుంది.Rrr

అలాగే షూటింగ్ గ్యాప్‌‌లో తారక్ చరణ్ చిల్ అవుతున్న చిన్నవీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. తారక్-చరణ్ కబుర్లు చెప్పుకుంటుంటే ఎదురుగా డమ్మీ కెమెరాతో వారిని షూట్ చేస్తూ జక్కన్న కనిపించారు. ఇక ఈ సినిమాలో అజయ్ దేవ్‌‌గణ్ – శ్రియ – సముద్రఖని తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించగా.. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాస్తున్నారు. ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. డీవీవీ పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

BIgg Boss 5: ఆ స్టార్‌ యాంకర్‌ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా.? సాలిడ్‌ హింట్‌ ఇచ్చిన కో యాంకర్‌.

Nagarjuna: వైరల్ అవుతున్న నాగ్ నయా లుక్.. చైతూ- అఖిల్‌‌‌‌కు అన్నయ్యలా ఉన్నారుగా..

Prabhas’s Salaar : డార్లింగ్ అభిమానులకు అదిరిపోయే సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌ను ప్లాన్ చేస్తున్న సలార్ మేకర్స్.

హీరోగా కాకపోతే క్రికెటర్ అయ్యేవాడిని..
హీరోగా కాకపోతే క్రికెటర్ అయ్యేవాడిని..
చిన్న వయసులోనే తెల్ల జుట్టు ఎందుకొస్తుంది.. అసలు నిజాలు తెలిస్తే
చిన్న వయసులోనే తెల్ల జుట్టు ఎందుకొస్తుంది.. అసలు నిజాలు తెలిస్తే
బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!
బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..