Bad Boys: Ride or Die: ఓటీటీలోకి వచ్చేస్తోన్న హాలీవుడ్ యాక్షన్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

ఇందులో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్, మార్టిన్ లారెన్స్ కలిసి నటించారు. దాదాపు రూ.10 కోట్ల డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం 40 కోట్ల డాలర్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. 2020లో వచ్చిన బ్యాడ్ బాయ్స్ ఆఫ్ లైఫ్ సినిమాకు ఇది సీక్వెల్. ఈ చిత్రానికి ఆదిల్, బిలాల్ దర్శకత్వం వహించారు. థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.

Bad Boys: Ride or Die: ఓటీటీలోకి వచ్చేస్తోన్న హాలీవుడ్ యాక్షన్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Bad Boys
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 13, 2024 | 2:30 PM

హాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా బ్యాడ్ బాయ్స్.. రైడ్ ఆర్ డై మూవీ. రెండు నెలల కిందట అంటే జూన్ 7న అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా భారీగా కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల్లో 9వ స్థానంలోనిలిచింది. ఇందులో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్, మార్టిన్ లారెన్స్ కలిసి నటించారు. దాదాపు రూ.10 కోట్ల డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం 40 కోట్ల డాలర్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. 2020లో వచ్చిన బ్యాడ్ బాయ్స్ ఆఫ్ లైఫ్ సినిమాకు ఇది సీక్వెల్. ఈ చిత్రానికి ఆదిల్, బిలాల్ దర్శకత్వం వహించారు. థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.

తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ 6 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటికే ప్రైమ్ వీడియో, జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ రెండు ఓటీటీల్లో రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. ఇక ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో మాత్రం సెప్టెంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో విల్ స్మిత్, మార్టిన్ లారెన్స్ డిటెక్టివ్ పాత్రలలో కనిపించారు.

కథ విషయానికి వస్తే.. బ్యాడ్ బాయ్స్ ఫ్రాంఛైజీలో భాగంగా వచ్చిన ఈ సినిమాలో మియామీ డిటెక్టివ్స్ అయిన మైక్ లారీ, మార్కస్ బర్నెట్ తమ దివంగత కెప్టెన్ కాన్రాడ్ హోవర్ట్ పై మోపిన తప్పుడు కుట్ర కేసును ఛేదించే పనిలో ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 40 కోట్ల డాలర్లు రాబట్టింది. విడుదలైన రెండు నెలలకు ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.