సమంత(Samantha Ruth Prabhu).. ఈ పేరు తెలియని ప్రేక్షకులు ఉంటారా.. ఏం మాయ చేశావే సినిమాతో ప్రేక్షకులను తనమత్తులో పడేసింది సామ్. ఇక వరుస సినిమాలతో టాలీవుడ్‌ను తన వశం చేసేసుకుంది. స్టార్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్ గా మారింది ఈ బ్యూటీ. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలకు జోడీగా నటించింది సమంత.అలాగే తమిళ్ లోనూ ఈ అమ్మడు తన సత్త చాటింది. అక్కడ కూడా స్టార్ల సరసన నటించింది. కెరీర్ మంచి స్వింగ్ లో ఉన్నపుడే అక్కినేని యంగ్ హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడింది. ఈ ఇద్దరి వివాహం అంగరంగవైభవంగా జరిగింది. ఇక పెళ్ళైన కొన్నాళ్లకే ఈ ఇద్దరు విడిపోతున్నట్టు ప్రకటించి షాక్ ఇచ్చారు. విడిపోయిన తర్వాత చైతూ తన సినిమాలతో బిజీ అయిపోయాడు. అయితే సామ్ మాత్రం సోషల్ మీడియా వేదికగా రకరకాల పోస్ట్‌లతో హోరెత్తించింది.
మోటివేషన్స్ పోస్ట్ లు పెడుతూ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది సామ్. అలాగే ఆ తర్వాత హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేసి హీట్ పెంచింది. అయితే గత కొద్ది వారాలుగా సామ్ సోషల్ మీడియాలో కనిపించడం లేదు. మొన్నామధ్య కరణ్ జోహార్ నిర్వహించిన కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొంది సామ్. అప్పటి నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తోంది. దాదాపు 5 వారాలనుంచి సామ్ సోషల్ మీడియాకు దూరం ఉంటోంది. దాంతో సామ్ అభిమానులంతా.. సామ్ ఎక్కడ ఉన్నావ్ నువ్వు.. అంటూ ఎదురుచూస్తున్నారు. అయితే రీసెంట్ గా ఎయిర్ పోర్ట్ లో ప్రత్యక్షం అయ్యింది సామ్. అప్పుడు అమ్మడి చేతిలో ఓ పుస్తకం కనిపించింది. ఆ బుక్ పేరు.. ‘యు కెన్ హీల్ యువర్ లైఫ్’ దాంతో ఆమె తన జీవితాన్ని చక్కదిదుకునేందుకు ప్రయత్నిస్తుందని అందుకే సోషల్ మీడియాకు దూరంగా ఉంటుందని అంటున్నారు కొందరు ఫ్యాన్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి