Sai Pallavi: పుట్టపర్తి సత్యసాయి నిలయంలో సాయి పల్లవి.. సాయి సన్నిధిలోనే కొత్తసంవత్సర వేడుకలు

|

Jan 01, 2023 | 4:39 PM

ఇక గత ఏడాది సాయి పల్లవి విరాట పర్వం, లవ్ స్టోరీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు సినిమాలు మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. ఈ రెండు సినిమాల్లో సాయి పల్లవి తన నటనతో ఆకట్టుకుంది.

Sai Pallavi: పుట్టపర్తి సత్యసాయి నిలయంలో సాయి పల్లవి.. సాయి సన్నిధిలోనే కొత్తసంవత్సర వేడుకలు
Sai Pallavi
Follow us on

టాలీవుడ్ లో లేడీ పవర్ స్టార్ గా ఎదిగింది సాయి పల్లవి. ఆమెకు మన దగ్గర మాములు ఫాలోయింగ్ ఉండదు. స్కిన్ షో కు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ దూసుకుపోతోంది సాయి పల్లవి. ఇక గత ఏడాది సాయి పల్లవి విరాట పర్వం, లవ్ స్టోరీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు సినిమాలు మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. ఈ రెండు సినిమాల్లో సాయి పల్లవి తన నటనతో ఆకట్టుకుంది. లవ్ స్టోరీ సినిమా తర్వాత ఆమె మరో సినిమా కమిట్ అవ్వలేదు. దాంతో ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. సడన్ గా సాయి పల్లవి సైలెంట్ అయ్యిందేంటని అంతా షాక్ అయ్యారు. సినిమాలకు దూరం అవుతుందని కూడా ప్రచారం జరిగింది.

ఇదిలా ఉంటే తాజాగా సాయి పల్లవి పుట్టపర్తి సత్యసాయి నిలయానికి వెళ్ళింది. సత్యసాయి కొలువులోనే ఆమె కొత్తసంవత్సర వేడుకలు జరుపుకున్నారు. రాత్రంతా సాయి స్మరణతో తరించారు. స్వతహాగా సత్యసాయికి భక్తురాలైన సాయి పల్లవి.. పలు ఇంటర్వ్యూల్లో ఆ విషయాన్ని చెప్పారు. మరోవైపు కొత్త ఏడాది సందర్భంగా  పుట్టపర్తికి దేశ విదేశీ భక్తులు తరలివచ్చారు.

ఇవి కూడా చదవండి