Will Smith: బహిరంగ క్షమాపణ చెప్పిన స్టార్ హీరో విల్ స్మిత్.. కానీ అది చాలదు అంటూ..
హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ ఆస్కార్ అవార్డ్స్ వేదిక పై చేసిన రచ్చ గురించి అందరికి తెలిసిందే.. తోటి నటుడు , కమెడియన్ అయినా క్రిస్ రాక్ ను చెంప చెళ్లుమనెలా కొట్టాడు స్మిత్.

హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్(Will Smith)ఆస్కార్ అవార్డ్స్ వేదిక పై చేసిన రచ్చ గురించి అందరికి తెలిసిందే.. తోటి నటుడు , కమెడియన్ అయినా క్రిస్ రాక్ ను చెంప చెళ్లుమనెలా కొట్టాడు స్మిత్. అప్పుడు అది హాట్ టాపిక్. తన భార్య గురించి కామెంట్ చేశాడాని అందరు చూస్తుండగానే విల్ స్మిత్ స్టేజ్ పైకి ఎక్కి మరి క్రిస్ రాక్ ను లాగిపెట్టి కొట్టాడు. అంతటితో ఆగకుండా నోటికొచ్చినట్టు తిట్టాడు కూడా.. అయితే ఆసమయంలో క్రిస్ రాక్ దాన్ని అంత సీరియస్ గా తీసుకోకుండా ఆ అవార్డ్స్ కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. అయితే ఆ తర్వాత విల్ స్మిత్ క్షమాపణలు చెప్పినట్టు ఎక్కడా వార్తలు కూడా రాలేదు. తాజాగా విల్ స్మిత్ క్రిస్ రాక్ కు బహింరంగ క్షమాపణ తెలిపారు.
తాజాగా జరిగిన ఓ ఇంట్రవ్యూలో క్రిస్ రాక్ ను కొట్టినందుకు ఫీల్ అయ్యారా.. ? ఆయనకు క్షమాపణలు చెప్పాలని అనిపించలేదా.? అనే ప్రశ్నలు స్మిత్‌కు ఎదురయ్యాయి. దీనిపై స్పందిస్తూ.. నేను క్రిస్ రాక్ తో మాట్లాడటానికి ప్రయత్నించా.. కానీ అతడు నాతో మాట్లాడటానికి సిద్ధంగా లేడు. ‘క్రిస్ రాక్.. ఇప్పుడు అందరి ముందు నీకు క్షమాపణలు చెపుతున్నా’.. ఇది నీకు చాలదనే విషయం నాకు తెలుసు… నీవు ఎక్కడంటే అక్కడ నీతో మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నా.. నీకే కాదు నీ కుటుంబానికి, ఆస్కార్ కమిటీకి, నా వల్ల ఇబ్బందిపడిన అందరికి క్షమాపణ చెప్తున్నా అని వీడియో ద్వారా చెప్పుకొచ్చారు విల్ స్మిత్.
Will Smith apologises to Chris Rock and fans over Oscars slap pic.twitter.com/q7OxxGfd6G
— The Independent (@Independent) July 29, 2022







