Venkatesh : అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఎఫ్ 2కి ట్రిపుల్ డోస్ వినోదం ఎఫ్ 3లో వుంటుంది: వెంకటేష్

|

May 25, 2022 | 1:57 PM

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ 2 సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Venkatesh : అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఎఫ్ 2కి ట్రిపుల్ డోస్ వినోదం ఎఫ్ 3లో వుంటుంది: వెంకటేష్
Venkatesh
Follow us on

అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ 2 సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాని, అందులో పాత్రలని ప్రేక్షకులంతా ఎంతో అభిమానించారు. ఎఫ్ 3 నుండి ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ వినోదం కోరుకుంటారు. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఎఫ్ 2కి ట్రిపుల్ డోస్ వినోదం ఎఫ్ 3లో వుంటుంది” అన్నారు హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh ). విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. డబుల్ బ్లాక్‌బస్టర్ ‘ఎఫ్ 2’ ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఎఫ్3 ‘ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్‌టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైమౌతున్న నేపధ్యంలో హీరో విక్టరీ వెంకటేష్ ఎఫ్ 3 సినిమా విశేషాలను పంచుకున్నారు.

నారప్ప, దృశ్యం రెండూ సీరియస్ సినిమాలు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఓటీటీలో విడుదలయ్యాయి. ఎఫ్ 3తో మళ్ళీ థియేటర్ ఆడియన్స్ ని కలవడం ఆనందంగా వుంది అన్నారు వెంకటేష్. కామెడీ అనగానే ఒక ప్రత్యకమైన ఎనర్జీ వచ్చేస్తుంది. కాలేజీ రోజుల్లో ఉన్నట్లే అనిపిస్తుంది. నేను సహజంగానే అందరితోనూ సరదాగా ఉంటా. నన్న ఇలా చూడటానికి ప్రేక్షకులు కూడా ఇష్టపడతారు. రెండేళ్ళ గ్యాప్ తర్వాత ఎఫ్ 3లాంటి బిగ్ ఎంటర్ టైనర్ తో రావడం ఆనందంగా వుంది. ఫ్యామిలీతో కలసి ఇలాంటి ఎంటర్ టైనర్లు చూడటంలో ఓ కిక్ వుంటుంది. ఎఫ్ 2పెద్ద విజయం సాధించింది. ఆ సినిమాని, పాత్రలని ప్రేక్షకులంతా అభిమానించారు. ఎఫ్ 3 నుండి ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ వినోదం కోరుకుంటారు. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఎఫ్ 2కి ట్రిపుల్ డోస్ వినోదం ఎఫ్ 3లో వుంటుంది. అలాగే అనిల్ రావిపూడి గురించి మాట్లాడుతూ.. అనిల్ రావిపూడి చాలా సింపుల్ పర్శన్. నటీనటుల నుండి ది బెస్ట్ తీసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. చాలా అద్భుతంగా రాస్తారు. ఆయన డైలాగ్స్ చాలా నేచురల్ గా వుంటాయి. దీంతో నటన కూడా సహజంగా అనిపిస్తుంది. అనిల్ చాలా ఎనర్జిటిక్. మేము ఇద్దరం క్రేజీగా వుంటాం. మసాలా సినిమా నుండే అనిల్ నాకు తెలుసు. అనిల్ లో అద్భుతమైన కామెడీ టైమింగ్ వుంది. ఆయనకి ఏం కావాలో క్లారిటీ వుంది అన్నారు. ఎఫ్ 3లో మోర్ ఫన్ యాడ్ అయ్యింది. చాలా మంది నటులు యాడ్ అయ్యారు. సినిమా చాలా లావిష్ గా తీశాం. చాలా మంచి సీక్వెన్స్ లు వున్నాయి. ఎఫ్ 2కి మించిన ఫన్ ఎఫ్ 3 లో వుంది అన్నారు వెంకీ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Sunil : అప్పట్లో రాఘవేంద్ర రావు.. ఇప్పుడు అనిల్ రావిపూడి మాత్రమే.. సునీల్ ఆసక్తికర కామెంట్స్

F3 Movie: డబ్బు విషయంలో వెంకటేష్ ఫిలాసపీ అదుర్స్‌.. ఏమన్నారంటే..