AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rana Daggubati: స్టార్ హీరో ఇంట్లో తీవ్ర విషాదం.. పాడె మోసిన హీరో రానా

హీరో దగ్గుబాటి రానా నిర్మాతగాను టాక్ షో హోస్ట్ గాను వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించిన రానా.. బిజినెస్ లు టాక్ షోలతో గడిపేస్తున్నారు. తాజగా రానా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన అమ్మమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. అంతిమయాత్రలో పాల్గొన్న రానా తన అమ్మమ్మ పాడె ను మోశారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను బంధువులతో పంచుకున్నారు.

Rana Daggubati: స్టార్ హీరో ఇంట్లో తీవ్ర విషాదం.. పాడె మోసిన హీరో రానా
Rana
B Ravi Kumar
| Edited By: |

Updated on: Jan 30, 2025 | 12:00 PM

Share

అమ్మమ్మ, నానమ్మలంటే చిన్నారులకు చాలా ఇష్టం. తల్లి కోపడినపుడు గారంగా ఇంట్లో పెద్ధవాళ్ల వెనక్కు వెళ్లి పిల్లలు దాక్కుంటారు. ఆడుకుంటూ వారి చెంగు ముఖానికి కప్పుకుని దాగుడుమూతలు ఆడతారు. వయస్సు మళ్లిన వ్రృద్ధులకు మనుమల చిలిపి చేష్టలు, ముద్దు – ముద్దు ముచ్చట్లు తీపి జ్ఞాపకాలు గా ఉంటాయి. తమతో పడుకున్న మనుమలు, మనుమరాళ్లకు నీతి కథలు చెప్పటం, లోక రీతిని బోధించటం పెద్ధవాళ్లకు సరదా.

అంతేనా తమ పిల్లల సంతానం ఇంటికి వేస్తే తెగ సంబరపడి పోయి వారికి ఇష్టమైన తినుబండారాలు చేసి. స్వయంగా వారికి వడ్డించి వారి కళ్లలో ఆనందాన్ని చూస్తారు. ఆ సంతోషంలో తమ కష్టాన్ని మరచి పోతారు. పిల్లలకు తమ అమ్మమ్మలు, నాయనమ్మలతో ఎంతో అనుబంధం ఉంటుంది. వారితోనే ఎక్కువగా కాలక్షేపం చేస్తారు. కాసేపు వారు కనిపించకపోయినా ఎక్కడకు వెళ్లరని ఆరా తీస్తుంటారు.

ఈ జ్ఞాపకాలు సినీ నటుడు దగ్గుపాటి రానాకు ఉన్నాయి. ఇటీవల తణుకు మాజీ శాసనసభ్యులు వై.టి రాజా తల్లి, పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణ చౌదరి సతీమణి భార్య రాజేశ్వరి మ్రృతి చెందారు. ఆమె అంత్యక్రియలకు ప్రముఖ నిర్మాత దగ్గుపాటి సురేష్ ఆయన కుమారుడు రానాలు హాజరయ్యారు. రాజేశ్వరి దేవి నటుడు రానాకు అమ్మమ్మ, దగ్గుపాటి సురేష్ బాబు ఆమెకు అల్లుడు. అంతిమయాత్రలో పాల్గొన్న రానా తన అమ్మమ్మ పాడెను మోశారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను బంధువులతో పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఒక ఫోటో బయటకు రావటంతో అందరూ రానాకు తణుకు ప్రాంతానికి ఉన్న అనుబంధం గురించి మాట్లాడుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.