18 Pages: అప్పుడు అలా అనుకున్నా.. కానీ ఇప్పుడు సర్ ప్రైజ్ అవుతున్నా.. నిఖిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

అంతకు ముందు ఈ జంట కార్తికేయ2 లో కలిసి నటించి అలరించారు. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పొయిటిక్ లవ్ స్టోరీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది.

18 Pages: అప్పుడు అలా అనుకున్నా.. కానీ ఇప్పుడు సర్ ప్రైజ్ అవుతున్నా.. నిఖిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Nikhil

Updated on: Dec 29, 2022 | 9:13 PM

కార్తికేయ-2 వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత నిఖిల్ సిద్దార్థ్ నటించిన సినిమా 18 పేజెస్. అందమైన ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో నిఖిల్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. అంతకు ముందు ఈ జంట కార్తికేయ2 లో కలిసి నటించి అలరించారు. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పొయిటిక్ లవ్ స్టోరీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. సినిమాకు రోజురోజుకు మంచి స్పందన లభిస్తున్న తరుణంలో ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ..

సినిమా రిలీజై వారం రోజులు అవుతుంది.. నేను న్యూస్ పేపర్స్ బుక్ మై షో చూస్తుంటే మొదటిరోజు ఎన్ని థియేటర్స్ ఉన్నాయో అంతకుమించిన థియేటర్స్ ఉన్నాయ్ కొన్ని చోట్ల, ఇది ఒక బిగ్ అచివ్మెంట్. 18 పేజెస్ సినిమా ఒక స్లో పాయిజన్ అండి. 2022 వెనక్కు తిరిగి చూసుకుంటే టాప్ ఫైవ్ లవ్ స్టోరీస్ లో 18 పేజెస్ ఉంటుంది. ఈ సినిమాను ఎలా ఆదరిస్తారో అనుకున్నాను, కానీ నిజంగా ఈరోజు సర్ ప్రైజ్  అవుతున్నాను, ఒక మంచి కథను బ్యూటిఫుల్ గా చెప్తే సినిమా చాలా బాగుంటుంది. ఇది మాస్ ఎంటెర్టైమెంట్ కాదు, సిచ్యువేషన్స్ తో వెళ్తున్న కామెడీ ఉంటుంది ఈ సినిమాలో. ఈ సినిమా క్లైమాక్స్ ను మీరు బిగ్ స్క్రీన్ మీద చూడాలి. అరవింద్ గారికి, బన్నీవాసు గారికి థాంక్యూ, ఈ కథను నాకు ఇచ్చిన సుకుమార్ గారికి అందరికి థాంక్యూ. కెరియర్ వైజ్ గా నాకు నా జీవితంలో ఇది బెస్ట్ ఇయర్ థాంక్యూ అని అన్నాడు.

ఇవి కూడా చదవండి

అలాగే  హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ..  మీడియాకు చాలా థాంక్యూ, కొన్ని సినిమాలు చేసినప్పుడు మనకు కిక్ వస్తుంది. కానీ 18 పేజెస్ సినిమాకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ నాకు సంతృప్తినిచ్చింది. ఒక యాక్టర్ గా చాలా మంచి సినిమా చేసిన ఫీల్ వచ్చింది. శతమానం భవతి నిత్యా కేరక్టర్ కి ఎలా పేరు వచ్చిందో ఇప్పుడు కూడా అలానే ఉంది. థాంక్యూ సో మచ్ ఇలాంటి ఒక క్రేజి లవ్ స్టోరీ ను ఎంకరేజ్ చేసినందుకు.. అంటూ చెప్పుకొచ్చింది.