Vishnu Manchu: భక్త కన్నప్ప యాక్షన్ సన్నివేశం షూటింగ్.. డ్రోన్ కూలి గాయపడిన విష్ణు..

ప్రముఖ సినీ ఎనలిస్ట్ రమేశ్ బాల తన ట్విట్టర్ లో భక్తకన్నప్ప సినిమా షూటింగ్ విషయం విష్ణుకు గాయపడిన సందర్భాన్ని వెల్లడిస్తూ ఓ పోస్ట్ చేశారు. అంతేకాదు తన డ్రీమ్ ప్రాజెక్ట్ షూటింగ్ లో ఓ డ్రోన్ కూలడంతో విష్ణుకి గాయాలయ్యాయి.. అయితే ఈ విషయం గురించి చిత్ర నిర్మాతలు ఎటువంటి ప్రకటన చేయలేదంటూ రమేశ్ బాల పోస్ట్ చేశారు.

Vishnu Manchu: భక్త కన్నప్ప యాక్షన్ సన్నివేశం షూటింగ్.. డ్రోన్ కూలి గాయపడిన విష్ణు..
Manchu Vishnu
Follow us
Surya Kala

|

Updated on: Oct 29, 2023 | 7:50 PM

మంచు విష్ణు హీరోగా తండ్రి మోహన్ బాబు నిర్మిస్తున్న పౌరాణిక సినిమా భక్త కన్నప్ప. న్యూజిలాండ్ లోని అందమైన లొకేషన్ల మధ్య షూటింగ్ జరుపుకుంతొంది. తాజాగా షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు.. విష్ణు గాయపడినట్లు తెలుస్తోంది. ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో విష్ణుకు తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. అదుపు తప్పి  ఓ డ్రోన్ కెమెరా విష్ణు మీదకు వెళ్లడంతో ఆయన చేతిని అడ్డుపెట్టగా.. చేతికి బలమైన గాయం అయినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వెంటనే స్పందించిన చిత్ర యూనిట్ విష్ణుని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ నిలివేసినట్లు సమాచరం. అయితే విష్ణు గాయం గురించి చిత్ర యూనిట్ ఎటువంటి అధికారక ప్రకటన చేయలేదు. ప్రముఖ సినీ ఎనలిస్ట్ రమేశ్ బాల తన ట్విట్టర్ లో భక్తకన్నప్ప సినిమా షూటింగ్ విషయం విష్ణుకు గాయపడిన సందర్భాన్ని వెల్లడిస్తూ ఓ పోస్ట్ చేశారు. అంతేకాదు తన డ్రీమ్ ప్రాజెక్ట్ షూటింగ్ లో ఓ డ్రోన్ కూలడంతో విష్ణుకి గాయాలయ్యాయి.. అయితే ఈ విషయం గురించి చిత్ర నిర్మాతలు ఎటువంటి ప్రకటన చేయలేదంటూ రమేశ్ బాల పోస్ట్ చేశారు. దీంతో మంచు విష్ణు త్వరగా కోలుకోవాలని అని అభిమానులు కోరుకుంటున్నారు..  సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమం ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీ కాళహస్తిలో జరుపుకున్న సంగతి తెల్సిందే. మహాభారతం సీరియల్‌‌ను మనకందించిన ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న భక్త కన్నప్ప సినిమాలో ప్రభాస్ ఓ కీలక పాత్రలో .కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ను న్యూజిలాండ్‌ లోని అద్భుతమైన ప్రకృతి అందాల మధ్య జరుపుకోనున్నట్లు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా మంచువిష్ణు ప్రకటించిన సంగతి తెలిసిందే..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..