Manchu Manoj – Mounika: ‘పిల్లా ఓ పిల్లా ‘.. బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన మౌనిక.. మనోజ్ లవ్లీ రిప్లై చూశారా?

|

Mar 03, 2024 | 7:15 PM

టాలీవుడ్ రాక్‌ స్టార్‌, హీరో మంచు మనోజ్ త్వరలోనే తండ్రిగా ప్రమోషన్ పొందనున్నాడు. అతని సతీమణి భూమా మౌనిక రెడ్డి త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. తన అత్తమ్మ, దివంగత నేత భూమా శోభానాగిరెడ్డి జయంతి రోజున ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్‌ చేసుకున్నాడు మనోజ్

Manchu Manoj - Mounika: పిల్లా ఓ పిల్లా .. బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన మౌనిక.. మనోజ్ లవ్లీ రిప్లై చూశారా?
Manchu Manoj, Bhuma Mounika
Follow us on

టాలీవుడ్ రాక్‌ స్టార్‌, హీరో మంచు మనోజ్ త్వరలోనే తండ్రిగా ప్రమోషన్ పొందనున్నాడు. అతని సతీమణి భూమా మౌనిక రెడ్డి త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. తన అత్తమ్మ, దివంగత నేత భూమా శోభానాగిరెడ్డి జయంతి రోజున ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్‌ చేసుకున్నాడు మనోజ్. తాజాగా మనోజ్ సతీమణి మౌనికా రెడ్డి బేబీ బంప్‌ తో ఉన్న ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో బ్లాక్‌ డ్రెస్‌లో ఎంతో అందంగా మెరిసిపోయింది మౌనిక. ఈ ఫొటోలను చూసిన మనోజ్ కూడా వెంటనే స్పందించాడు. లవ్లీ రిప్లైతో భార్యపై తన ప్రేమను చాటుకున్నాడు. ‘పిల్లా ఓ పిల్లా.. నవ్వవంటే నాకు ప్రాణమే’ అంటూ తన పాట లిరిక్స్ ను జత చేసి కామెంట్ పెట్టారు. ప్రస్తుతం మౌనిక బేబీ బంప్ ఫొటోలు, మనోజ్ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మౌనిక దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా మంచు మనోజ్, భూమా నాగ మౌనిక రెడ్డి గత ఏడాది మార్చి 3న పెళ్లిపీటలెక్కారు. వివాహానికి ముందు ప్రేమలో ఉన్న వీరు ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. ఇక మౌనికకు ఇప్పటికే ధైరవ్ అనే బాబు ఉన్నాడు. పెళ్లి సమయంలోనే ధైరవ్‌ బాధ్యతలు కూడా తానే తీసుకుంటానని ప్రకటించాడు మనోజ్. ఇక ఇప్పుడు రెండోసారి తల్లి కాబోతుంది మౌనిక. ఇక సినిమాల విషయానికొస్తే.. గత కొన్నేళ్లుగా వెండితెరపై కనిపించని మంచు మనోజ్ త్వరలోనే వాట్‌ ది ఫిష్‌ అనే మూవీతో మన ముందుకు వస్తున్నాడు. మెగా డాటర్ నిహారిక ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తోంది. అలాగే ఈటీవీ విన్‌లో ఉస్తాద్‌ అనే రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు మనోజ్.

ఇవి కూడా చదవండి

బేబీ బంప్  భూమా మౌనికా రెడ్డి..

మంచు మనోజ్ పోస్ట్..

భార్య మౌనికతో మనోజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.