టాలీవుడ్ హీరో మంచు మనోజ్ రెండో పెళ్లితో తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన దివంగత రాజకీయ నాయకుడు భూమా మౌనికతో కలిసి ఏడడుగులు వేశాడు మనోజ్. ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో మనోజ్- మౌనికల వివాహం గ్రాండ్‌గా జరిగింది. ఇక పెళ్లి తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయాడు మనోజ్. అలాగే ఇటీవల ఓ టీవీ షోకు హాజరై తన ప్రేమ, పెళ్లినాటి ముచ్చట్లు పంచుకున్నారీ లవ్లీ కపుల్. తాజాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఇచ్చిన పార్టీలోనూ సందడి చేశారు మౌనిక- మనోజ్. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారీ బ్యూటిఫుల్ కపుల్. పెళ్లి తర్వాత మంచు మనోజ్‌తో దిగిన మొదటి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది మౌనిక. తాజాగా మనోజ్ కూడా ఒక పోస్ట్ పెట్టాడు. తన పెళ్లికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో తన వివాహ వేడుకలకు సంబంధించిన పలు మధుర జ్ఞాపకాలున్నాయి. మనోజ్ కుటుంబ సభ్యులు, అలాగే మౌనిక కుటుంబ సభ్యులు, వైఎస్ విజయమ్మ, ఇలాగే ఇరువురి సన్నిహితులు, స్నేహితులను ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన మనోజ్..
‘ఇలాంటి ప్రేమ జీవితంలో ఎవరికైనా ఒక్కసారే దక్కుతుంది. నువ్వు నా కోసమే ఈ భూమ్మీదకు వచ్చావని నాకు తెలుసు. నేను ఇప్పటికీ, ఎప్పటికీ నీ వాడినే. నిజంగా ప్రేమిస్తే ఎలా ఉంటుందో నాకు తెలిసేలా చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ తన సతీమణిపై ప్రేమకు అక్షర రూపమిచ్చాడు మనోజ్. ప్రస్తుతం మనోజ్- మౌనికల పెళ్లి వీడియో, అలాగే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మనోజ్- మౌనికల జోడీ అద్భుతంగా ఉందంటూ, చూడముచ్చటైన జంట, మేడ్ ఫర్ ఈచ్ అదర్, లవ్లీ కపుల్ అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా మనోజ్- మౌనికల పెళ్లి సాంగ్‌కు కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అచు రాజమణి స్వరాలూ అందించారు. అలాగే అనంత శ్రీరామ్ లిరిక్స్ ని సమకూర్చాడు.
“THEY SAY THIS KIND OF LOVE IS ONCE IN A LIFETIME, AND I KNOW YOU ARE THE ONE FOR ME. I OFFER YOU ALL
OF ME TODAY AND FOR ALWAYS. THANK YOU FOR SHOWING
ME HOW IT FEELS TO BE LOVED” @BhumaMounika ?▶️ https://t.co/BeOXs0pJ5n pic.twitter.com/ctcK8WqSDK
— Manoj Manchu??❤️ (@HeroManoj1) April 18, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.