Karthi: మా అన్న అప్పుడు హగ్ చేసుకున్నారు.. మళ్లీ ఇప్పుడే.. ఎమోషనల్ అయిన కార్తీ

|

Sep 23, 2024 | 8:56 PM

96 సినిమా తర్వాత డైరెక్టర్ ప్రేమ్ కుమార్ చేస్తున్న సినిమా ఇది. 96 కి చాలా ఫాలోయింగ్ వవుంది. దాదాపు ఆరేళ్ళ తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా. రెండేళ్ళ క్రితం నా కోసం ప్రేమ్ దగ్గర ఓ కథ వుందని నా ఫ్రెండ్ చెప్పాడు. కానీ ఆయన నాకు చెప్పడానికి భయపడుతున్నారు.

Karthi: మా అన్న అప్పుడు హగ్ చేసుకున్నారు.. మళ్లీ ఇప్పుడే.. ఎమోషనల్ అయిన కార్తీ
Karthi Sivakumar
Follow us on

హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘సత్యం సుందరం’. 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో కార్తి మాట్లాడుతూ.. సినిమా విశేషాలని పంచుకున్నారు.

ఇది కూడా చదవండి : మహానటి సావిత్రితో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. ఎవరో గుర్తుపట్టారా.?

96 సినిమా తర్వాత డైరెక్టర్ ప్రేమ్ కుమార్ చేస్తున్న సినిమా ఇది. 96 కి చాలా ఫాలోయింగ్ వవుంది. దాదాపు ఆరేళ్ళ తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా. రెండేళ్ళ క్రితం నా కోసం ప్రేమ్ దగ్గర ఓ కథ వుందని నా ఫ్రెండ్ చెప్పాడు. కానీ ఆయన నాకు చెప్పడానికి భయపడుతున్నారు. నేనే మెసేజ్ చేశాను. అప్పుడాయన ఈ స్క్రిప్ట్ ని చదవమని ఇచ్చారు. స్క్రిప్ట్ ని ఒక అద్భుతమైన నవల రాశారు. మొత్తం చదివాను. చాలా చోట్ల ఆనందంలో కన్నీళ్ళు వచ్చాయి. ఇలాంటి కథ ఎలా రాస్తారని అనిపించింది. నాకు కే విశ్వనాధ్ గారి సినిమాలు ఇష్టం. కానీ ఇప్పుడు అలాంటి కథలు రావడం లేదు. ఈ కథ చదివినప్పుడు అలాంటి ఒక మంచి సినిమా అవుతుందనిపించింది. చాలా రేర్ స్క్రిప్ట్. డిఫినెట్ గా చేయాలనిపించింది. మనలోని చాలా ప్రశ్నలు సమాధానం ఇచ్చే కథ ఇది. అన్నయ్యకి కథ చదవమని చెప్పాను. అన్నయ్యకి చాలా నచ్చింది. నీకు మాత్రమే ఇలాంటి కథలు ఎలా వస్తున్నాయి అన్నారు. ఖచ్చితంగా చేద్దామని చెప్పారు.

ఇది కూడా చదవండి :ఈ అందాల నటి గుర్తుందా.? ఒకప్పుడు కుర్రాళ్ళ ఫెవరెట్ ఆమె.. ఇప్పుడు ఎలా ఉందంటే

బ్రదర్స్ లాంటి రెండు క్యారెక్టర్స్ మధ్యనడిచే కథ ఇది. ప్రతి ఒక్కరూ చూడాలనుకునే సినిమా. అరవింద్ స్వామి గారు ఇందులో క్యారెక్ట కి ర్ పర్ఫెక్ట్. ఆయన చదివి చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ కథని చదివినవారంతా ప్రాజెక్ట్ లో పార్ట్ అవ్వాలని ఆసక్తి చూపారు. 96లానే ఇది ఒక్క నైట్ లో జరిగే కథ. ఫ్యామిలీ ఆడియన్స్ కి కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. సాగర సంగమం సినిమా చూసినప్పుడు ఎలాంటి ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుందో సత్యం సుందరంలో కూడా లాంటి ఓ మంచి అనుభూతిని ప్రేక్షకులు ఆస్వాదిస్తారు. విశ్వనాథ్ గారి సినిమాలు కమర్షియల్ బ్లాక్ బస్టర్సే. ఇది కూడా అలాంటి సినిమానే అని అన్నారు కార్తీ. అలాగే కార్తీ మాట్లాడుతూ.. సూర్య నా మొదటి సినిమా చూసి నన్ను హాగ్ చేసుకున్నారు. మళ్ళీ ఈ సినిమా చూసి చాలా ప్రౌడ్ గా హాగ్ చేసుకున్నారు. అద్భుతంగా పెర్ఫార్మ్ చేశానని కాంప్లిమెంట్ ఇచ్చారు అని తెలిపారు కార్తీ.

ఇది కూడా చదవండి : Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్‌లో మరోసారి ఆ ముద్దుగుమ్మ.. ఈసారి రచ్చ రచ్చ ఖాయం అంటున్నారే