- Telugu News Photo Gallery Cinema photos Tollywood Actor Sree Vishnu Shares His Family Photos On National Daughters Day
Sree Vishnu: క్యూట్ అండ్ స్వీట్.. హీరో శ్రీ విష్ణు భార్య, కూతురును చూశారా? లేటెస్ట్ ఫొటోస్ వైరల్
నేషనల్ డాటర్స్ డే (సెప్టెంబర్ 22) సందర్భంగా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు తమ కూతుళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. వారితో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇదే క్రమంలో ప్రామిసింగ్ హీరో శ్రీ విష్ణు కూడా తన భార్య, కూతురితో కలిసి దిగిన కొన్ని ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు.
Updated on: Sep 23, 2024 | 8:52 PM

నేషనల్ డాటర్స్ డే (సెప్టెంబర్ 22) సందర్భంగా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు తమ కూతుళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. వారితో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇదే క్రమంలో ప్రామిసింగ్ హీరో శ్రీ విష్ణు కూడా తన భార్య, కూతురితో కలిసి దిగిన కొన్ని ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు.

ప్రస్తుతం టాలీవుడ్ లోని ప్రామిసింగ్ హీరోల్లో శ్రీ విష్ణు ఒకడు. వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ వర్సటైల్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

గతేడాది సామజవరగమన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ హ్యాండ్సమ్ హీరో ఈ ఏడాది ఓం భీమ్ బుష్ తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు.

ఇక శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ సినిమా 'స్వాగ్' మూవీ అక్టోబరు 4న థియేటర్లలోకి రానుంది. ఇందులో రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది.

తాజాగా ఆదివారం డాటర్స్ డే (కూతుళ్ల దినోత్సవం) సందర్భంగా కుమార్తెతో దిగిన ఫొటోల్నిసోషల్ మీడియాలో షేర్ చేశాడు శ్రీ విష్ణు.

సినిమాల్లో గుర్తింపు తెచ్చుకోకముందే శ్రీవిష్ణు.. ప్రశాంతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు మిృదా అనే కూతురు ఉంది