సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. మహేష్ చివరిగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా పై మహేష్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ మూవీ ప్రేక్షకులను నిరాశపరిచింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు రాజమౌళి సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమాను తీసుకురానున్నారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. ఇప్పటికే రాజమౌళి మహేష్ బాబు సినిమా కోసం లోకేషన్స్ వెతికే పనిలో ఉన్నారు. ప్రస్తుతం రాజమౌళి కెన్యాలో పార్క్ లను సందర్శించారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. ఇప్పటికే లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో అదరగొట్టారు మహేష్ బాబు. అయితే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా ఏళ్ళు పట్టేలా కనిపిస్తుంది. అయితే ఈ లోగ మహేష్ బాబు.. మరో సినిమాలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఓ యంగ్ హీరో సినిమాలో మహేష్ బాబు గెస్ట్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఆ యంగ్ హీరో ఎవరో కాదు మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్.
హీరో అనే సినిమాతో ఈ కుర్ర హీరో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆతర్వాత ఈ యంగ్ హీరో నటిస్తున్న సినిమా దేవకీ నందన వాసుదేవ. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు కృష్ణుడుగా కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. మహేష్ బాబును కృష్ణుడుగా చూడాలని మహేష్ బాబు ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు దేవకీ నందన వాసుదేవ సినిమాలో మహేష్ కృష్ణుడిగా కనిపించనున్నాడు అని జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా దీని పై అశోక గల్లా క్లారిటీ ఇచ్చారు. మహేష్ బాబు తన సినిమాలో నటించడం లేదు అని క్లారిటీ ఇచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.