Agent Movie: అయ్యగారు అదరగొట్టేశారంతే.. హాలీవుడ్‌ రేంజ్‌లో అఖిల్‌ ఏజెంట్‌ టీజర్‌..

|

Jul 15, 2022 | 6:20 PM

Akhil Akkineni’s Agent: మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ సినిమాతో మొదటి కమర్షియల్‌ హిట్‌ అందుకున్నాడు యంగ్‌ హీరో అఖిల్‌ (Akhil Akkineni). ఇప్పుడు ఏజెంట్‌ (Agent)గా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. టాలీవుడ్‌లో స్టైలిష్ డైరెక్టర్‌గా పేరున్న సురేందర్ రెడ్డి (Surender Reddy) ఈ యాక్షన్‌...

Agent Movie: అయ్యగారు అదరగొట్టేశారంతే.. హాలీవుడ్‌ రేంజ్‌లో అఖిల్‌ ఏజెంట్‌ టీజర్‌..
Akhil Akkineni's Agent
Follow us on

Akhil Akkineni’s Agent: మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ సినిమాతో మొదటి కమర్షియల్‌ హిట్‌ అందుకున్నాడు యంగ్‌ హీరో అఖిల్‌ (Akhil Akkineni). ఇప్పుడు ఏజెంట్‌ (Agent)గా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. టాలీవుడ్‌లో స్టైలిష్ డైరెక్టర్‌గా పేరున్న సురేందర్ రెడ్డి (Surender Reddy) ఈ యాక్షన్‌ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుండగా మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి పాన్‌ ఇండియా స్థాయిలో అఖిల్‌ సినిమా విడుదల కానుంది. ఈక్రమంలో అక్కినేని అభిమానులకు సర్‌ప్రైజ్‌నిస్తూ ఏజెంట్‌ మూవీ టీజర్‌ను రిలీజ్‌ చేసింది చిత్రబృందం. కూకట్ పల్లిలోని మల్లిఖార్జున థియేటర్ లో టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్ జరిగింది. కన్నడ టీజర్‌ను హీరో కిచ్చా సుదీప్ లాంచ్ చేయగా తమిళ్ టీజర్ ను శివకార్తికేయన్ విడుదల చేశారు.

బ్లాక్‌ బస్టర్‌ గ్యారెంటీ..

టీజర్‌ను చూస్తుంటే సరికొత్త స్పై థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తోంది. యాక్షన్‌ సీక్వెన్సులు హాలీవుడ్‌ రేంజ్‌లో ఉన్నాయి. ఇక అఖిల్‌ ఆహార్యం, చెప్పిన డైలాగులు అభిమానుల్లో జోష్‌ నింపేలా ఉన్నాయి. ఈ సినిమాకు కోలీవుడ్‌ స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ హిప్‌హాప్‌ తమీజా స్వరాలు సమకూరుస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘ఈ టీజర్ కోసం చాలా రోజుల నుంచి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నాం. ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్నది ముఖ్యం.
టీజర్ కన్నా వందరెట్లు అద్భుతంగా సినిమా ఉంటుంది. సురేందర్ రెడ్డి ఎంతో స్టైలిష్ గా ఈ సినిమాను తెరకెక్కించారు’ అని చెప్పుకొచ్చారు. ఇక సురేందర్ రెడ్డి మాట్లాడుతూ’ ఈ సినిమా బ్లాక్ బస్టర్ గ్యారెంటీ. మిగతాది ప్రి రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడతాను’ అని అన్నారు. ‘ఫ్యాన్స్ ఇచ్చే ఎనర్జీ మాటల్లో చెప్పలేను. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం’ అని హీరో అఖిల్‌ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..