Sujeeth: పవన్‌ కల్యాణ్‌ OG డైరెక్టర్‌ సుజిత్‌ భార్యను చూశారా? అందంలో స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదండోయ్‌

|

May 06, 2023 | 5:25 PM

సుజిత్‌ విషయానికొస్తే.. శర్వానంద్‌ రన్‌రాజారన్‌ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. లవ్‌, యాక్షన్‌, కామెడీ, సస్పెన్స్‌.. ఇలా అన్ని సమపాళ్లలో కలిపి రూపొందిన ఈ మూవీ శర్వాకు మంచి బ్రేక్‌ ఇచ్చింది. ఆ తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో కలిసి సాహోను తీశాడు.

Sujeeth: పవన్‌ కల్యాణ్‌ OG డైరెక్టర్‌ సుజిత్‌ భార్యను చూశారా? అందంలో స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదండోయ్‌
Pawan Kalyan Og
Follow us on

డైరెక్టర్‌ సుజిత్‌.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్‌లో ఉన్న పేరు. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో ఆయన చేస్తున్న ఓజీ సినిమానే ఇందుకు కారణం. మాఫియా, గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సుజిత్‌ పవన్‌ను ఎంతో స్టైలిష్‌గా చూపించనున్నారట. ఇప్పటికే ముంబైలో జరిగిన ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయ్యింది. ఇందులో పవన్‌ లుక్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరలవయ్యాయి. సుజిత్‌ విషయానికొస్తే.. శర్వానంద్‌ రన్‌రాజారన్‌ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. లవ్‌, యాక్షన్‌, కామెడీ, సస్పెన్స్‌.. ఇలా అన్ని సమపాళ్లలో కలిపి రూపొందిన ఈ మూవీ శర్వాకు మంచి బ్రేక్‌ ఇచ్చింది. ఆ తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో కలిసి సాహోను తీశాడు. తెలుగులో ఆడకపోయినా హిందీలో ఈ మూవీ సూపర్‌హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా సుజిత్‌ మేకింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు. ఇప్పుడు పవన్‌ను కూడా మోస్ట్‌ స్టైలిష్‌ గ్యాంగ్‌స్టర్‌గా చూపించనున్నారట. ఇక సుజిత్‌ వ్యక్తిగత జీవిత విషయానికొస్తే.. అతనిది ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా. మొదట ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ కావాలకున్నఅతను ఆతర్వాత సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.

ఇక సుజిత్‌ భార్య విషయానికొస్తే.. 2020 ఆగ‌స్టులో ప్రవల్లిక అనే అమ్మాయితో ఏడ‌డుగులు వేశాడు. వీరిది ప్రేమ వివాహమట. చాలా ఏళ్లుగా ప్రేమించుకున్న ఈ జంట పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారట. కాగా సుజిత్‌ వైఫ్‌ విషయానికొస్తే.. హైదరాబాద్‌లోని టాప్‌ 10 డెంటిస్టుల్లో ప్రవల్లిక ఒకరట. ఆమె నెల ఆదాయం కూడా భారీగానే ఉంటుందని తెలుస్తోంది. ఇక సుజిత్ సతీమణికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. అందంలో స్టార్‌ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదంటూ కామెంట్లు కురిపిస్తున్నారు నెటిజన్లు.

ఇవి కూడా చదవండి

సుజిత్ పెళ్లి ఫొటోస్

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..