Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా? అచ్చం అమ్మ పోలికే.. అప్పుడే సినిమాల్లోకి కూడా..

|

Aug 26, 2024 | 4:17 PM

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లయ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన అందం, అభినయంతో ప్రేక్షకును కట్టిపడేసిందీ అందాల తార. అందుకే లయ సినిమాలు మానేసి కొన్నేళ్లు అయినా ఇప్పటికీ తమ మనసుల్లో అందాల తారగా గుర్తు పెట్టుకున్నారు

Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా? అచ్చం అమ్మ పోలికే.. అప్పుడే సినిమాల్లోకి కూడా..
Actress Laya
Follow us on

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లయ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన అందం, అభినయంతో ప్రేక్షకును కట్టిపడేసిందీ అందాల తార. అందుకే లయ సినిమాలు మానేసి కొన్నేళ్లు అయినా ఇప్పటికీ తమ మనసుల్లో అందాల తారగా గుర్తు పెట్టుకున్నారు. వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన స్వయంవరం సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది లయ. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్ టైన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిందీ అందాల తార. ఆ తర్వాత హనుమాన్ జంక్షన్, ప్రేమించు, మిస్సమ్మ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ప్రేమించు సినిమాకు గానూ ఉత్తమ నటిగా నంది పురస్కారం కూడా అందుకుందీ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది లయ. 2006లో అమెరికాకు చెందిన డాక్టర్ శ్రీ గణేశన్ ను వివాహం చేసుకున్న లయ ఆ తర్వాత అక్కడే సెటిల్ అయ్యింది. ప్రస్తుతం ఈ దంపతులకు ఓ పాప, బాబు ఉన్నారు.

కాగా పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చేసిన లయ సెకెండ్ ఇన్నింగ్స్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే నితిన్ తో కలిసి రాబిన్ హుడ్ సినిమాలో నటిస్తోందీ అందాల తార. అలాగే బిగ్ బాస్ ఫేమ్ నటుడు శివాజీతో కలిసి మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఇదిలా ఉంటే లయ కూతురు శ్లోకా ఇప్పటికే ఛైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ మాహరాజా రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో ఆమె ఇలియానా చిన్నప్పటి పాత్రలో కనిపించింది.

ఇవి కూడా చదవండి

కూతురు శ్లోకతో లయ..

ఇక శ్లోక చూడడానికి అచ్చం అమ్మలాగే ఉంటుంది. ఇటీవల తన కూతురితో కలిసి కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది లయ. వీటిని చూసిన వారందరూ శ్లోక లయకు చెల్లెలిలాగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక తన కూతురు హీరోయిన్ గా నటిస్తే చూడాలని ఉందని గతంలో పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది లయ.

భర్త, పిల్లలతో హీరోయిన్ లయ.. క్యూట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.