Actor Suman: మణిపాల్ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్.. క్లాసికల్ డ్యాన్సర్.. హీరో సుమన్ కూతురిని చూశారా?

ఒకప్పుడు హీరోగా మెగాస్టార్ చిరంజీవికి గట్టి పోటీ ఇచ్చాడు సుమన్. అయితే అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనలు అతని సినిమా కెరీర్ ను కాస్త వెనక్కు నెట్టాయి. అయినా యాక్షన్ హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సుమన్.

Actor Suman: మణిపాల్ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్.. క్లాసికల్ డ్యాన్సర్.. హీరో సుమన్ కూతురిని చూశారా?
Actor Suman

Updated on: Aug 20, 2025 | 7:18 PM

తెలుగు సినిమా ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు సుమన్. సుమారు 150 కు పైగా సినిమాల్లో నటించి మెప్పించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్.ముఖ్యంగా ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి నంబర్ వన్ స్థానానికి గట్టి పోటీ ఇచ్చారు సుమన్. అందం, యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్.. ఇలా అన్ని విషయాల్లోనూ చిరంజీవితో సరితూగాడు. కానీ అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనలు సుమన్ సినిమా కెరీర్ ను దెబ్బ తీశాయి. అయినా యాక్షన్ హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నాడు సుమన్. ఆ తర్వాత శివాజీ సినిమాతో విలన్ గానూ అదరగొట్టాడు. ఇప్పటికీ సహాయక నటుడిగా బిజి బిజీగా ఉంటున్నారు సుమన్. సినిమాల సంగతి పక్కన పెడితే.. తెలుగులో ఫేమస్ రచయిన అయిన డీ వీ నరసరాజు మనవరాలు శిరీష తల్వార్ ని వివాహం చేసుకున్నాడు సుమన్. వీరిద్దరికి ఒక్క కుమార్తె ఉంది. ఆమె పేరు అఖిలజ ప్రత్యూక్ష. అయితే ఎప్పుడోకానీ ఈ స్టార్ కిడ్ బయట కనిపించదు. ఇక సోషల్ మీడియాలోనూ అడ్రస్ లేదు. అయితే ఆమె గురించి చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదేంటంటే.. చదువులో చురుగ్గా ఉండే ప్రత్యూష మణిపాల్‌ యూనివర్సిటీలో హ్యూమన్‌ జెనిటిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సంపాదించిందట.

 

ఇక ప్రత్యూష క్లాసికల్ డ్యాన్సర్ కూడా. హైదరాబాద్ రవీంద్ర భారతి కళా క్షేత్రంతో పాటు పలు డ్యాన్స్ పోటీలలో పాల్గొని బహుమతులు కూడా గెల్చుకుంది. ఈ క్రమంలోనే ప్రత్యూషను సినిమాల్లోకి తీసుకురావాలని ఎంతో మంది స్టార్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ప్రయత్నించారట. సుమన్ ను కూడా రిక్వెస్ట్ చేశారట. అయితే ప్రత్యూషకు సినిమాలంటే ఆసక్తిలేదట. దీంతో సుమన్ కూడా ఏమీ చేయలేకపోయారట.

ఇవి కూడా చదవండి

ఇక ఆ మధ్యన సుమన్ తన కూతురును ఒక స్టార్ హీరో కొడుకుకు ఇచ్చి పెళ్లి చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఓ పెద్దింటి కోడలికి ప్రత్యూషను పంపిస్తున్నట్లు తెగ ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలు రూమర్లేనని కొట్టిపారేశాడు సుమన్. ఇప్పుడప్పుడే తనకు పెళ్లి చేయాలి అనుకోవడం లేదు. తను ఇంకా చదువుకుంటోంది. ఇలాంటి వార్తలు రాయడం ఆపండి అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Suman Daughter

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.