
టాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సుమారు ఇరవై ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. విలన్‌గా, సహాయ నటుడిగా వందలాది చిత్రాల్లో నటించి మెప్పించాడు. హీరోగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. ‘విక్రమార్కుడు, ఆర్య 2, దూకుడు, రాజన్న, ఇష్క్, గబ్బర్ సింగ్, ఒక్కడు, అతడు, పోకిరి, అల వైకుంఠ పురం, సరిలేరు నీకెవ్వరు, 18 పేజీస్,విరూపాక్ష, పుష్ప, సరిపోదా శనివారం, మారుతీ నగర్ సుబ్రమణ్యం, గుంటూరు కారం, మత్తు వదలరా 2, దేవర పార్ట్-1, పుష్ప 2, మజాకా, మత్తు వదలరా 2, క.. ఇలా చెప్పుకుంటూ పోనే ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు అజయ్. సారాయి వీర్రాజు సినిమాతో హీరోగా నూ మారాడు. కానీ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో మళ్లీ విలన్ అవతారమెత్తాడు. గతేడాది 10 సినిమాల్లో నటించిన అజయ్ ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాల్లో భాగమయ్యాడు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు నటుడిగా అజయ్ ఎంత బిజీగా ఉంటున్నాడో. సినిమాల సంగతి పక్కన పెడితే.. అజయ్ ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. అజయ్ భార్య, పిల్లలు కూడా పెద్దగా బయట కనిపించరు. ఎలాంటి సినిమా ఈవెంట్లు, ఫంక్షన్లకు రారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. అజయ్ తో పాటు అతని భార్య శ్వేత తరచూ తన ఫ్యామిలీ ఫొటోస్ ను షేర్ చేస్తుంటుంది.
పెళ్లయ్యాక మోడల్ గా..
అజయ్ భార్య పేరు శ్వేత రావూరీ. కాలేజ్ లో చదువుకుంటోన్న సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. మొదట సీక్రెట్ గా ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి మరోసారి పెళ్లి చేసుకున్నారు. కాగా పెళ్లయ్యాక కూడా మోడలింగ్ లో సత్తా చాటింది అజయ్ భార్య. 2017 సంవత్సరంలో మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీల్లో ఫైనల్ దాకా వెళ్లందీ అందాల తార.. ఆ మరుసటి ఏడాదే అంటే 2018 సంవత్సరంలో అంబాసిడర్ మిస్టర్ అండ్ మిసెస్ సౌత్ ఇండియాగా కూడా ఎంపికైంది.
కాగా అజయ్-శ్వేతలకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. అజయ్ భార్య ఫొటోలు అప్పుడప్పుడు నెట్టింట వైరలవుతుంటాయి.
వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తుంటారు. అజయ్ ఫ్యామిలీ చాలా క్యూట్ గా ఉందని, అతని భార్య హీరోయిన్ కు ఏ మాత్రం తక్కువ కాదంటూ కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.