Tollywood: ఏంటి సుధా ఈ అందం.. కట్టప్ప కూతుర్ని మీరు చూశారా..?
సత్యరాజ్ కుమార్తెకు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. సొగసైన లుక్స్‌తో కవ్విస్తున్న ఆమె పిక్స్ చూసిన నెటిజన్స్ 'హీరోయిన్‌కు ఏ మాత్రం తీసిపోదు' అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆయితే ఆమెకు సినిమాలపై ఇంట్రస్ట్ లేదట
యాక్టర్ సత్యరాజ్.. తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన నటుడు. ఒకానొక సమయంలో ఆయన తమిళనాట అగ్ర హీరోగా రాణించారు. కాస్త వయస్సు మళ్లిన తర్వాత.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టర్న్ అయ్యారు. తెలుగులో కూడా శంఖం, మిర్చి వంటి సినిమాల్లో హీరోలకు తండ్రి పాత్రల్లో నటించి ప్రేక్షకులకు చేరువయ్యారు. బాహుబలి సినిమాతో ఆయన ఇమేజ్ అంతర్జాతీయ స్థాయికి చేరింది. సినిమాలో కట్టప్పగా ఆయన ఒదిగిపోయారు. ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో కీ ఆర్టిస్ట్ అయిపోయారు. ఇంత పాపులర్ అయినప్పటికీ ఆయన మీడియాకు ఎప్పుడూ దూరంగానే ఉంటారు. తన పర్సనల్ లైఫ్ గురించి గోప్యత పాటిస్తారు. అందుకే సత్యరాజ్ కుటుంబం గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. ఆయనకు భార్య మహేశ్వరి, ఓ కొడుకు, కుమార్తె ఉన్నారు.
సత్యరాజ్ తనయుడు సిబిరాజ్ చిత్ర పరిశ్రమలోకి అగుపెట్టి… డోరా, మాయోన్ వంటి మూవీస్ చేశాడు. ఇక ఆయన కుమార్తె పేరు దివ్య సత్యరాజ్. ప్రస్తుతం ఆమె ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. సినీ ఫీల్డ్‌కి డిస్టెన్స్ పాటిస్తున్న దివ్య న్యూట్రిషియన్‌గా కెరీర్ కొనసాగిస్తుంది. సోషల్ మీడియాలో ఆమె చాలా చలాకీగా ఉంటుంది. తరచూ నెటిజన్లకు హెల్త్, లైఫ్ స్టైల్‌పై టిప్స్ ఇస్తుంది. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో చాలా ఫాలోవర్స్ ఏర్పడ్డారు. ఈ నేపథ్యంలో ఆమె ఫొటోలు.. బాగా వైరల్ అవ్వడంతో హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోని అందం అంటూ నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. కాగా దివ్య మహిళ్‌మతి ఇయక్కం పేరుతో వాలంటీర్ వ్యవస్థను స్థాపించి సోషల్ సర్వీస్ చేస్తుంది. ఆయితే ఆమెకు రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లుంది.. త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.