Hari Hara Veera Mallu: బాబీ డియోల్‌ పాత్రకి ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారా? షూటింగ్ కూడా చేసి మధ్యలోనే..

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లు మరికొన్ని గంటల్లో రిలీజ్ కానుంది. ఈ రాత్రికే ప్రీమియర్స్, బెనిఫిట్ షోలు పడనున్నాయి. ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో బాలీవుడ్ నటుడు బాబీ డియోలో ఓ కీలక పాత్రలో నటించాడు.

Hari Hara Veera Mallu: బాబీ డియోల్‌ పాత్రకి ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారా? షూటింగ్ కూడా చేసి మధ్యలోనే..
Hari Hara Veeramallu review

Updated on: Jul 23, 2025 | 7:18 PM

మెగా ఫ్యాన్స్‌తో పాటు సగటు సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్నసినిమా హరి హర వీరమల్లు. పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక
రిలీజవుతోన్న మొదటి సినిమా కావడంతో వీరమల్లుపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు ఈ సినిమా టీజర్స్ , ట్రైలర్లు ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక పవన్ కల్యాణ్ స్వయంగా ప్రమోషన్లలో పాల్గొనడంతో హరి హర వీరమల్లుపై ఒక్కసారిగా హైప్ పెరిగింది. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రీమియర్స్ పడనున్నాయి. ఇందుకోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ మొఘల్ రాజు ఔరంగ జేబుగా ఓ కీలక పాత్రలో నటించాడు. సినిమాలో బాబీ పాత్ర కూడా చాల కీలకంగా ఉంటుందని ప్రమోషన్లలో పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పడం విశేషం.

అయితే వీరమల్లులో ఔరంగ జేబు పాత్ర కోసం బాబీ డియోల్ కన్న ముందు వేరొకరిని అనుకున్నారట. కొద్ది రోజుల పాటు షూటింగ్ కూడా చేశారట. అయితే ఎందుకోగానీ అతను మధ్యలోనే వదిలి వెళ్లిపోయాడట. అతను మరెవరో కాదు భగవంత్ కేసరి విలన్, బాలీవుడ్ హ్యాండ్సమ్ యాక్టర్ అర్జున్ రాంపాల్. కొన్ని రోజుల పాటు అతనితోనే షూటింగ్‌ కూడా చేశారట. అయితే సినిమా బాగా డిలే కావడంతో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో అర్జున్‌ రాంపాల్‌ తప్పుకున్నారని సమాచారం. ఆ తర్వాత ఆ పాత్ర కోసం బాబీ డియోల్‌ని తీసుకున్నారట. ఇక వీరమల్లు ట్రైలర్ లో కూడా బాబీ డియోల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఔరంగ జేబు పాత్రలో ఈ బాలీవుడ్ నటుడు బాగా సూట్ అయ్యాడని, బాగా చేశారని పవన్ ప్రశంసలు కురిపించడం విశేషం. బాబీతో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని పవర్ స్టార్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరికొన్ని గంట్లలో వీరమల్లు ప్రీమియర్స్..

మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏఎం రత్నం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్‌తో హరి హర వీరమల్లు సినిమాను నిర్మించారు. ఆస్కార్ విజేత కీరవాణి ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు.

అప్పుడే థియేటర్ల దగ్గర మొదలైన హంగామా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..