AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: నో జిమ్.. నో వర్కౌట్స్.. 69 ఏళ్ల వయసులో 26 కిలోలు తగ్గిన స్టార్ సెలబ్రిటీ.. వెయిట్ లాస్ టిప్స్ ఇవేనట

సాధారణంగా బరువు తగ్గాలంటే చాలా మంద నోరు కట్టేసుకుంటారు. గంటల తరబడి జిమ్ లో గడుపుతుంటారు. కఠినమైన వర్కవుట్లు, వ్యాయామాలు చేస్తుంటారు. అయితే ఇవేమీ చేయకుండానే ఏకంగా 26 కిలోలు తగ్గాడు ఓ స్టార్ సెలబ్రిటీ.. అది కూడా 69 ఏళ్ల వయసులో..

Tollywood: నో జిమ్.. నో వర్కౌట్స్.. 69 ఏళ్ల వయసులో 26 కిలోలు తగ్గిన స్టార్ సెలబ్రిటీ.. వెయిట్ లాస్ టిప్స్ ఇవేనట
Bollywood Producer
Basha Shek
|

Updated on: Jul 23, 2025 | 6:59 PM

Share

పై ఫొటోలో సన్నగా, స్లిమ్ లుక్ లో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆయనొక స్టార్ సెలబ్రిటీ. ఫేమస్ ఫిల్మ్ మేకర్. ఆయన భార్య కూడా స్టార్ హీరోయిన్. ఒకప్పుడు తన అందం, అభినయంతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. తెలుగుతో పాటు హిందీలో లెక్కలేనన్నీ సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఇప్పటికీ ఆమెను ఆరాధించే అభిమానులు, హీరోలు ఉన్నారంటే అతి శయోక్తి కాదు. ఇక ఇప్పుడు వీరి కూతురు కూడా హీరోయిన్ గా రాణిస్తోంది. తల్లి అడుగు జాడల్లోనే నడుస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే మొన్నటివరకు ఎంతో లావుగా కనిపించిన ఈ ఫిల్మ్ మేకర్ ఇప్పుడు ఉన్నట్లుండి స్లిమ్ గా మారిపోయారు. భారీగా బరువు తగ్గి సన్నగా కనిపిస్తున్నారు. ఈయన కొత్త లుక్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నరు. చాలా మంది మొదట గుర్తు పట్టలేకపోయారు కూడా. మరి పై ఫొటోలో ఉన్నదెవరో మీరు గుర్తు పట్టారా? ఆయన మరెవరో కాదు అలనాటి అందాల తార శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్.

ప్రముఖ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన బోనీ కపూర్ లేటెస్ట్ ఫొటోలు షేర్ చేశాడు. దీంతో అవి ఒక్కసారిగా నెట్టింట వైరల్ గా మారాయి. నిజంగా ఇత‌ను బోనీ క‌పూరేనా అని కొంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇక తన వెయిట్ లాస్ టిప్స్ విషయానికి వస్తే.. అసలు జిమ్ కు వెళ్లకుండానే 26 కిలలు తగ్గారట బోనీ కపూర్. ఇక ఆయన డైట్ ప్లాన్ విషయనికి వస్తే.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో పండ్లు, పండ్ల రసాలు, జవర్ రోటీ మాత్రమే తీసుకున్నారట. మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో సలాడ్లు, సూప్‌లు వంటి తేలికపాటి ఆహారం మాత్రమే తిన్నారట. అలాగే కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారానికే ప్రాధాన్యమిచ్చారట. ఇ అనవసరమైన విందులు, ఫంక్ష‌న్స్ వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉన్నారట. ఈ మార్పు వెనక ఎలాంటి మాయ, స్పెషల్ ట్రైనింగ్ ఏమీ లేదని, జిమ్ కు కూడా వెళ్లలేదంటున్నారు బోనీ కపూర్. కేవలం డెడికేషన్, ఆత్మనిబ్బరం తోనే ఇలా సన్నగా మారిపోయానని చెబుతున్నారీ స్టార్ ప్రొడ్యూసర్.

ఇవి కూడా చదవండి

బోనీ కపూర్ లేటెస్ట్ ఫొటోలు..

nbsp;

View this post on Instagram

A post shared by Boney.kapoor (@boney.kapoor)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
2027 వన్డే ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ
2027 వన్డే ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ
వాట్సప్‌ వాడేవారికి అదిరిపోయే సూపర్ న్యూస్
వాట్సప్‌ వాడేవారికి అదిరిపోయే సూపర్ న్యూస్
GATE 2027 రిజిస్ట్రేషన్ చేయాలంటే DigiLocker తెరవాల్సిందే..!
GATE 2027 రిజిస్ట్రేషన్ చేయాలంటే DigiLocker తెరవాల్సిందే..!
ఈసారి అలాంటి పప్పులుడకవ్..కంటెస్టెంట్లకు నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్
ఈసారి అలాంటి పప్పులుడకవ్..కంటెస్టెంట్లకు నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్
బోనాల ప్రత్యేకం: తెలంగాణ ప్రజల ఇలవేల్పు మైసిగండి మైసమ్మ ఆలయం..
బోనాల ప్రత్యేకం: తెలంగాణ ప్రజల ఇలవేల్పు మైసిగండి మైసమ్మ ఆలయం..
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలెర్ట్..ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వాన
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలెర్ట్..ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వాన
త్రిషపై.. ఉదయనిధి షాకింగ్‌ కామెంట్స్‌.. తమిళనాడులో పెను దుమారం!
త్రిషపై.. ఉదయనిధి షాకింగ్‌ కామెంట్స్‌.. తమిళనాడులో పెను దుమారం!
రాహువు కటాక్షం..ఆ రాశుల వారికి కొత్త శుభ యోగాలు!
రాహువు కటాక్షం..ఆ రాశుల వారికి కొత్త శుభ యోగాలు!
నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేసుల రద్దుకు గ్రీన్ సిగ్నల్
నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేసుల రద్దుకు గ్రీన్ సిగ్నల్