వెండి తెరపై చాలా మంది హీరోయిన్స్ వస్తుంటారు పోతుంటారు కానీ కొంతమంది మాత్రం తమ ముద్రవేసి తిరుగులేని తరాలుగా నిలిచిపోతారు అలాంటి ఓ అందాల తారే రమ్యకృష్ణ(Ramya Krishnan). ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎన్నో కమర్షియల్ చిత్రాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రమ్యకృష్ణ. అందంలోనే కాదు నటనలోనూ తన సత్తా ఏంటో చూపింది అగ్రహీరోయిన్ గా ఎదిగారు. ఎన్నో చిత్రాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా, దేవత పాత్రలలో, తల్లి, అక్క వదిన పాత్రలో ఎంతో అద్భుతంగా నటిస్తూ.. ఎంతో మంచి ప్రేక్షకాదరణ పొందారు రమ్యకృష్ణ. నేడు ఈ అందాల భామ పుట్టిన రోజు. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించారు రమ్యకృష్ణ. 1985లో వచ్చిన భలే మిత్రులు చిత్రంతో హీరోయిన్ గా తెలుగు చిత్రరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.
నరసింహ చిత్రంలో రజినీకాంత్‌తో పోటీపడి మరీ చేసిన ‘నీలాంబరి’ పాత్రను రక్తి కట్టించింది. ఈ సినిమా దక్షిణ భారతదేశంలో కాకుండా, సింగపూర్, లండన్, ఫ్రాన్స్, జపాన్ లాంటి అనేక దేశాల్లో విడుదలై అంతర్జాతీయంగా కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాహుబలి సినిమాతో భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో ఆమె తప్ప మరెవ్వరూ నటించలేరు అన్నంతగా నటించి మెప్పించింది రమ్యకృష్ణ. ఇటీవలే లైగర్ సినిమాలో విజయ్ తల్లి పాత్రలో నటించి అలరించారు రమ్యకృష్ణ. ప్రస్తుతం రంగమార్తాండ సినిమాలో నటిస్తున్నారు రమ్యకృష్ణ. పాత్ర ఏదైనా తనదైన నటనతో మెప్పిస్తొన్న రమ్యకృష్ణ ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకుపోవాలని కోరుకుందాం ..
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..