Hanuman Collections: రికార్డ్స్ బద్దలుకొట్టిన హనుమాన్.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ హవా.. వారం రోజుల్లో ఎంతంటే..

తక్కువ బడ్జెట్‏తో నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోంది. సినీ విమర్శకులు, అడియన్స్ ప్రశంసలు అందుకుంటూ దూసుకుపోతుంది. చిన్న సినిమాగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఇప్పుడు స్టార్ హీరోల రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది.

Hanuman Collections: రికార్డ్స్ బద్దలుకొట్టిన హనుమాన్.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ హవా.. వారం రోజుల్లో ఎంతంటే..
Hanuman Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 20, 2024 | 7:23 AM

టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన లేటేస్ట్ మూవీ ‘హనుమాన్’. తక్కువ బడ్జెట్‏తో నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోంది. సినీ విమర్శకులు, అడియన్స్ ప్రశంసలు అందుకుంటూ దూసుకుపోతుంది. చిన్న సినిమాగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఇప్పుడు స్టార్ హీరోల రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో, ఉత్తరాదిలో, అమెరికాలో హనుమాన్ హవా కొనసాగుతుంది. నార్త్ లో ఇప్పటికే ఇరవై కోట్లకు పైగా షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ముప్పై కోట్లకు పైగా వసుళ్లూ రాబట్టింది. ఇక ఇప్పుడు విడుదలైన రెండు వారాల్లోనే రూ. 150 కోట్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని మైత్రి మూవీస్ తెలియజేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.

హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏడు రోజుల్లోనే రూ.150 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. చిన్న సినిమాగా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ.. వారం రోజుల్లోనే ఈ మైలురాయిని దాటం విశేషంగా ఉందని.. అన్ని చోట్ల ఈ చిత్రానికి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని.. మరికొన్ని రోజుల్లో హనుమాన్ కలెక్షన్స్ మరిన్ని పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో రూ.65 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే హిందీలో రూ.30 కోట్ల వరకు రాబట్టింది. ఇతర భాషల్లోనూ ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.

రెండో వారంలో బాక్సాఫీస్ వద్ద హనుమాన్ జోరు కొనసాగుతుంది. ఇప్పటికీ థియేటర్లలో హౌస్ ఫుల్ అవుతున్నాయి. మరోవైపు రోజు రోజుకి ఈ సినిమాకు అడియన్స్ తాకిడి ఎక్కువవుతుంది. దాదాపు 90 శాతం షోలు హౌస్ ఫుల్ అవుతున్నాయి. ప్రశాంత్ వర్మ డైరెక్షన్, మేకింగ్, వీఎఫ్ఎక్స్, తేజా సజ్జా నటనపై ప్రశంసలు వస్తున్నాయి. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.