Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman Movie: ‘మేం దేవుళ్లను తప్పుగా చూపించలేం’.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆసక్తికర కామెంట్స్..

నార్త్ ఇండియాలోనే కాకుండా.. అమెరికాలోనూ ఈ మూవీ అత్యధిక కలెక్షన్స్ రాబడుతూ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. హనుమాన్ చిత్రయూనిట్.. దర్శకుడిపై సినీ ప్రముఖులు, ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, గోపిచంద్, రవితేజ, రామ్ గోపాల్ వర్మ లాంటి సినీ దిగ్గజాలు హనుమాన్ సినిమాపై తమ అభిప్రాయాలను తెలియజేశారు. ముఖ్యంగా ఈ సినిమా వీఎఫ్ఎక్స్ అడియన్స్ కు తెగ నచ్చేసింది.

Hanuman Movie: 'మేం దేవుళ్లను తప్పుగా చూపించలేం'.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆసక్తికర కామెంట్స్..
Prashanth Varma
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 18, 2024 | 7:22 AM

2024లో అతి పెద్ద విజయం అందుకున్న సినిమా ‘హనుమాన్’. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకుపై పైగా వసూలు చేసింది. తక్కువ బడ్జెట్‏తో రూపొందించబడిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. అటు నార్త్ ఇండియాలోనే కాకుండా.. అమెరికాలోనూ ఈ మూవీ అత్యధిక కలెక్షన్స్ రాబడుతూ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. హనుమాన్ చిత్రయూనిట్.. దర్శకుడిపై సినీ ప్రముఖులు, ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, గోపిచంద్, రవితేజ, రామ్ గోపాల్ వర్మ లాంటి సినీ దిగ్గజాలు హనుమాన్ సినిమాపై తమ అభిప్రాయాలను తెలియజేశారు. ముఖ్యంగా ఈ సినిమా వీఎఫ్ఎక్స్ అడియన్స్ కు తెగ నచ్చేసింది. ఈ క్రమంలో ఇటీవలే డీఎన్ఏ ఇండియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమా మేకింగ్.. వీఎఫ్ఎక్స్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

గతేడాదిలో రామాయణం ఆధారంగా ఆదిపురుష్, రామసేతు సినిమాలు విడుదలయ్యాయి. కానీ ఈ రెండు చిత్రాలు తీవ్రస్తాయిలో విమర్శలు ఎదుర్కోన్నాయి. కానీ తెలుగులో ఇప్పటివరకు వచ్చిన అలాంటి చిత్రాలకు ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదని అన్నారు ప్రశాంత్ వర్మ. “తెలుగు సినీ పరిశ్రమలో రామాయణం, మహాభారతం కథలను తిరిగి చెబుతూ ఎన్నో సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ సార్ ఇలాంటి సినిమాలు చాలా చేశారు. కానీ ఇలాంటి సమస్య ఎప్పుడూ లేదు. ఆయన సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరించారు. నిజానికి ఎన్టీఆర్ అంటే మాకు కృష్ణుడు, రాముడు. చాలా మంది ఇళ్లలో విగ్రహాలకు బదులుగా ఆయన ఫోటోస్ ఉన్నాయి. పరిశ్రమగా దేవుళ్లకు ప్రాతినిధ్యం వహించడంలో మేం ఎప్పుడూ తప్పు చేయలేదు” అంటూ చెప్పుకొచ్చారు ప్రశాంత్ వర్మ.

“నేను పని చేస్తున్న అన్ని రకాల చిత్రాలను నేను చూస్తాను. వాటిలో కొన్నింటి నుంచి సినిమా ఎలా తీయాలో నేర్చుకుంటాను. అలాగే ఇతర సినిమాల నుంచి ఎలా మూవీ తీయకూడదో నేర్చుకుంటాను. విభిన్న ఫలితాలను సాధించడానికి ప్రతిదీ భిన్నంగా చేయాలి. బహుశా.. ఇది మనం పెరిగిన వాతావరణం.. ఆ కథలను వింటూ పెరిగిన విధానం వల్ల కావచ్చు. ఇలాంటివి మా మనసులకు దగ్గగా ఉంటాయి. నేను ఇతర చిత్ర నిర్మాతల కోసం మాట్లాడలేదు. కానీ సంస్కృతి చరిత్రలను ఎప్పటికీ తారుమారు చేయను. నేను నిజంగా రామాయణం, మహాభారతాలను నా స్టైల్లో తిరిగి చెప్పాలనుకుంటున్నాను. కానీ నేను ఒక చిత్ర నిర్మాతగా తగినంత పరిణితి చెందలేదని .. అలా చేయడానికి తగినంత అనుభవం లేదని అనుకుంటున్నారు. ఆ పాత్రల స్పూర్తితో కొత్త కల్పిత కథలను రూపొందిస్తున్నాను ” అని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.