AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur Kaaram: ‘ఆ కుర్చీని మడతపెట్టి’.. బాబు మాస్ స్టెప్పులకు థియేటర్స్ దద్దరిల్లాల్సిందే…

గతంలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలను మించి గుంటూరు కారం సినిమాను తెరకెక్కిస్తున్నారు గురూజీ. మహేష్ బాబును మాస్ మసాలా కంటెంట్ తో తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్. ఇప్పటికే త్రివిక్రమ్ వదిలిన పోస్టర్స్ అభిమానులు ఫుల్ కిక్ ఇచ్చాయి. అలాగే ఈ సినిమానుంచి విడుదలైన సాంగ్స్ సినిమా పై హైప్ ను పెంచేశాయి. ఇప్పటికే గుంటూరు కారం సినిమానుంచి రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి.

Guntur Kaaram: 'ఆ కుర్చీని మడతపెట్టి'.. బాబు మాస్ స్టెప్పులకు థియేటర్స్ దద్దరిల్లాల్సిందే...
Gunturukaaram
Rajeev Rayala
|

Updated on: Dec 29, 2023 | 6:51 PM

Share

మహేష్ బాబు ఫ్యాన్స్ రెడీ అయిపోండి .. ఈసారి గుంటూరు కారం ఘాటు కాస్త ఎక్కువగానే ఉండేలా కనిపిస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న నయా మూవీ గుంటూరు కారం. త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్స్ లో వస్తున్న మూడో సినిమా ఇది. గతంలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలను మించి గుంటూరు కారం సినిమాను తెరకెక్కిస్తున్నారు గురూజీ. మహేష్ బాబును మాస్ మసాలా కంటెంట్ తో తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్. ఇప్పటికే త్రివిక్రమ్ వదిలిన పోస్టర్స్ అభిమానులు ఫుల్ కిక్ ఇచ్చాయి. అలాగే ఈ సినిమానుంచి విడుదలైన సాంగ్స్ సినిమా పై హైప్ ను పెంచేశాయి. ఇప్పటికే గుంటూరు కారం సినిమానుంచి రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. దమ్ మసాలా, ఓ మై బేబీ సాంగ్స్ ;ప్రేక్షకులను ఉర్రుతలూగించాయి. మొదటి సాంగ్ కు విపరీతమైన రెస్పాన్స్ రాగా సెకండ్ సాంగ్ పై మాత్రం కొన్ని విమర్శలు వచ్చాయి.

కానీ ఇప్పుడు మూడో సాంగ్  మాత్రం ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా ప్లాన్ చేశారు. తాజాగా గుంటూరు కారం సినిమానుంచి మూడో సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయినా.. కుర్చీని మడత పెట్టి అనే డైలాగ్ తో డీజే లెవల్ లో పాటను ప్లాన్ చేశారు. తాజాగా విడుదలైన ప్రోమో ఫ్యాన్స్ ను ఊపేస్తోంది.

ఈ సాంగ్ ప్రోమోలో శ్రీలీల, మహేష్ బాబు పోటీపడి డాన్స్ చేశారు. ఈ మధ్యకాలంలో మహేష్ బాబు అంతగా డాన్స్ చేయడం చాలా అరుదై పోయింది. సాంగ్స్ కూడా అలానే పడేవి.. కానీ ఇప్పుడు ఊర మాస్ బీట్ తో సాంగ్ ను డిజన్ చేశారు గురూజీ. తమన్ మాస్ బీట్ కు మహేష్ బాబు వేసిన స్టెప్పులు ఇప్పుడు ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇప్పటికే యూట్యూబ్ లో దూసుకుపోతోంది ఈ ప్రోమో.. రేపు ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక ఫుల్ సాంగ్ లో ఈ రేంజ్ స్టెప్పులు బోలెడన్ని ఉన్నాయని తెలుస్తోంది. థియేటర్స్ లో ఈ సాంగ్ కు మహేష్ ఫ్యాన్స్ మొత్తం స్టెప్పులెయ్యాల్సిందే.. మహేష్ బాబును ఇలా చూసి చాలా కాలం అయ్యిందంటున్నారు ఫ్యాన్స్.. గుంటూరు కారం దెబ్బకు థియేటర్స్ దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తుంది. గుంటూరు కారం సినిమా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us