AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shaakuntalam : షూటింగ్ కంప్లీట్ చేసుకున్న గుణశేఖర్ శాకుంతలం.. రిలీజ్ ఎప్పుడంటే..

టాలీవుడ్ దర్శకుల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గుణశేఖర్. మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకోవడమే కాకుండా  అందరి దృష్టిని ఆకర్షించారు గుణశేఖర్ ఆతర్వాత గుణశేఖర్‌కు..

Shaakuntalam : షూటింగ్ కంప్లీట్ చేసుకున్న గుణశేఖర్ శాకుంతలం.. రిలీజ్ ఎప్పుడంటే..
Samantha
Rajeev Rayala
| Edited By: Anil kumar poka|

Updated on: Aug 26, 2021 | 9:41 AM

Share

Shaakuntalam : టాలీవుడ్ దర్శకుల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గుణశేఖర్. మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకోవడమే కాకుండా  అందరి దృష్టిని ఆకర్షించారు గుణశేఖర్ ఆతర్వాత గుణశేఖర్‌కు ఆ రేంజ్ హిట్ దక్కలేదు. వరుసగా సినిమాలు చేసినప్పటికీ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేక పోయారు గుణశేఖర్. ఎట్టకేలకు అనుష్క ప్రధాన పాత్రలో నటించిన రుద్రమ దేవి సినిమాతో తిరిగి సాలిడ్ హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు మరోసారి హిస్టారికల్ మూవీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యారు గుణశేఖర్. శాకుంతలం అనే సినిమాతో రాబోతున్నారు ఈ క్రియేటివ్ డైరెక్టర్. సమంత ప్రధాన పాత్రలో వహిస్తున్న శాకుంతలం సినిమా పై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతున్న ఈ సినిమాను దిల్ రాజు సమర్పిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో కీలక పాత్రలో అల్లువారి వారసురాలు, అల్లు అర్జున్ గారాల పట్టి ఆర్ష నటిస్తుంది. ఇప్పటికే ఈ చిన్నారికి సంబంధించిన షూటింగ్‌ను కంప్లీట్ చేశారు. కేక్‌కట్ చేయించి ఈ చిన్నారికి బై చెప్పారు చిత్రయూనిట్. ఈ సినిమాలో అల్లు అర్హ ఈ సినిమాలో భరత కుమారుడి పాత్రలో కనిపించబోతుంది.

ఇక సమంత కూడా ఇటీవలే తన షూటింగ్‌ను కంప్లీట్ చేసింది. సామ్‌తో కూడా కేక్ కట్ చేయించి సమంతకు వీడ్కోలు పలికారు. అలాగే ఇప్పుడు సినిమాకు సంబంధించిన సన్నివేశాలు అన్ని కూడా ముగిశాయి అంటూ యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. తాజాగా హీరో దేవ్ మోహన్‌తో కూడా కేక్ కట్ చేయించి వీడ్కోలు పలికారు. దుశ్యంత్ పాత్రలో ఆయన కనిపించబోతున్నాడు.ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సినిమాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో పాన్ ఇండియా రేంజ్‌‌లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Aishwarya Rai: అచ్చం శివగామిలాగే ఐశ్వర్యా రాయ్.. నెట్టింట్లో హల్‏చల్ చేస్తోన్న ఐష్ న్యూలుక్.. చూస్తే ఫిదా కావాల్సిందే..

వయ్యారంగా ఫోటోకు ఫోజులిచ్చిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి.. మీ కోసం చిన్న క్లూ.. ఇప్పటికీ కుర్రాళ్ల కళల రాకుమారి..

Ram Gopal Varma: కాలేజీ రోజుల్లోనే రామ్ గోపాల్ వర్మ ప్రేమాయణం.. తన ఫస్ట్ లవర్ ఫోటో షేర్ చేసిన ఆర్జీవి..

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ