Tollywood: ఈ చిన్నారిని గుర్తు పట్టారా? స్టార్ నటి కమ్ డైరెక్టర్.. విజయవాడ అమ్మాయే

|

Sep 14, 2024 | 5:38 PM

ఈ ఫోటోలోని చిన్నారి ఎవరో తెలుసా? ఇప్పుడీ అమ్మాయి స్టార్ కమెడియన్ కమ్ అసిస్టెంట్ డైరెక్టర్. త్వరలోనే డైరెక్టర్ గా మెగా ఫోన్ కూడా పట్టుకోనుంది. విజయవాడకు చెందిన ఆమె ఇంజినీరింగ్ చదివింది. కానీ ఆర్జేగా కెరీర్ ప్రారంభించింది. అ తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టింది. తన నటనతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. ఎన్నో సినిమాల్లో హీరో, హీరోయిన్ల కు ఫ్రెండ్ గా కనిపించింది.

Tollywood: ఈ చిన్నారిని గుర్తు పట్టారా? స్టార్ నటి కమ్ డైరెక్టర్.. విజయవాడ అమ్మాయే
Tollywood Actor Childhood P
Follow us on

ఈ ఫోటోలోని చిన్నారి ఎవరో తెలుసా? ఇప్పుడీ అమ్మాయి స్టార్ కమెడియన్ కమ్ అసిస్టెంట్ డైరెక్టర్. త్వరలోనే డైరెక్టర్ గా మెగా ఫోన్ కూడా పట్టుకోనుంది. విజయవాడకు చెందిన ఆమె ఇంజినీరింగ్ చదివింది. కానీ ఆర్జేగా కెరీర్ ప్రారంభించింది. అ తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టింది. తన నటనతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. ఎన్నో సినిమాల్లో హీరో, హీరోయిన్ల కు ఫ్రెండ్ గా కనిపించింది. అయితే తాను సినిమాల్లోకి వచ్చింది నటించేందుకు కాదని, డైరెక్టర్ కావాలని భావించి.. అటు వైపుగా దృష్టి సారించింది. అందులో భాగంగానే మహేశ్, శర్వానంద్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించింది. త్వరలోనే మెగా ఫోన్ పట్టుకుని లేడీ డైరెక్టర్ గా మారేందుకు రెడీ అవుతోంది. మరీ ఇంతకు ఈ ట్యాలెంటెడ్ నటి ఎవరంటే స్వప్నిక రెడ్డి వర్ధనపు. ఇలా అంటే చాలా మందికి గుర్తుకు రాకపోవచ్చు. నారా రోహిత్ నటించిన సోలో సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ అంటే ఇట్టే మైండ్ లో మెదులుతోంది. చూడడానికి కాస్త బొద్దుగా కనిపించే స్వప్నిక గుంటూరు, విజయవాడలో పెరిగింది. ఆమె మంచి ఫుట్ బాల్ ప్లేయర్ కూడా. చిన్న వయస్సులోనే 93.5 రెడ్ ఎఫ్ఎం ఆర్జేగా మెప్పించింది.

 

ఇవి కూడా చదవండి

ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడే హైదరాబాద్ వచ్చింది స్వప్నిక. డైరెక్టర్‌ గా అదృష్టం పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేయగా, నటిగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. అలా ప్రభాస్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత నారా రోహిత్ సోలో చిత్రంలో నటించింది. ఇందులో శ్రీనివాసరెడ్డి.. స్వప్నిక మధ్య సీన్స్ ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. ఆ తర్వా జబర్దస్త్, నిప్పు, ఛలో, ఐయామ్ ఇన్ లవ్, చాణక్య తదితర సినిమాల్లో నటించింది.ఇదే క్రమంలో నందినీ రెడ్డీ ఓ బేబీ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా వ్యవహరించింది స్వప్నిక. అలాగే మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట, ఇటీవల రిలీజైన శర్వానంద్- కృతి శెట్టిల మనమే చిత్రాలకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిందీ ట్యాలెంటెడ్ వుమన్.

మనమే సినిమా షూటింగులో కృతి శెట్టితో స్వప్నిక..

త్వరలోనే డైరెక్టర్ గా కూడా అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది స్వప్నిక. సినిమాల సంగతి పక్కన పెడితే పదేళ్ల క్రితం బాలకృష్ణ అనే వ్యక్తిని వివాహం చేసుకుందామె . వీరికి ఓ బాబు ఉన్నాడని తెలుస్తోంది.

సర్కారు వారి పాట సినిమాలో మహేశ్ బాబుతో..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి