Tollywood: ఈ పుత్తడి బొమ్మ టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ.. ఈ ఏడాది అమ్మడిదే జోరు.. ఎవరో గుర్తుపట్టండి..

|

Apr 19, 2023 | 9:47 AM

తెలుగులో ఇప్పటివరకు ఆమె నటించిన చిత్రాలన్ని సూపర్ హిట్స్ అయ్యాయి. దీంతో ఈ బ్యూటీకి అవకాశాలు కూడా క్యూ కడుతున్నాయి. తెలుగులో చేసింది తక్కువ చిత్రాలే కానీ అగ్రకథానాయికలుగా గట్టి పోటీనిస్తుంది. ఎవరో గుర్తుపట్టారా ?. తను మలయాళీ కుట్టి.

Tollywood: ఈ పుత్తడి బొమ్మ టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ.. ఈ ఏడాది అమ్మడిదే జోరు.. ఎవరో గుర్తుపట్టండి..
Actress
Follow us on

పైన ఫోటోలో ఉన్న ఆ పుత్తడి బొమ్మ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అందాల ముద్దుగుమ్మ. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఫుల్ ఫాంలో దూసుకుపోతుంది. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆనతి కాలంలోనే భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అదృష్టం కాస్త ఎక్కువగానే ఉంది. తెలుగులో ఇప్పటివరకు ఆమె నటించిన చిత్రాలన్ని సూపర్ హిట్స్ అయ్యాయి. దీంతో ఈ బ్యూటీకి అవకాశాలు కూడా క్యూ కడుతున్నాయి. తెలుగులో చేసింది తక్కువ చిత్రాలే కానీ అగ్రకథానాయికలుగా గట్టి పోటీనిస్తుంది. ఎవరో గుర్తుపట్టారా ?. తను మలయాళీ కుట్టి. ఎవరంటే.. హీరోయిన్ సంయుక్త మీనన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన భీమ్లా నాయక్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది సంయుక్త.

1995 సెప్టెంబర్ 11న కేరళలోని పాలక్కడ్ ప్రాంతంలో జన్మించిన సంయుక్త.. త్రిసూర్ లో ఎకనామిక్స్ గ్రాడ్యూయేషన్ పూర్తిచేసింది. 2016లో పాప్ కార్న్ అనే సినిమాతో మలయాళం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2018లో కలరి సినిమాతో తమిళ్ సినీరంగానికి పరిచయమైంది. మలయాళం, తమిళంలో హిట్స్ అందుకుని బిజీగా మారిపోయింది సంయుక్త. ఇక ఆ తర్వాత గతేడాది తెలుగు తెరకు పరిచయమై హిట్ ఖాతాలో వేసుకుంది. భీమ్లా నాయక్ సినిమా తర్వాత సంయుక్త కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. వరుస అవకాశాలతో క్షణం తీరికలేకుండా గడిచిపోయింది.

ఇవి కూడా చదవండి

భీమ్లానాయక్ తర్వాత బింబిసార, సార్ చిత్రాల్లో నటించి మెప్పించింది సంయుక్త. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. ప్రస్తుతం ఆమె సాయ్ ధరమ్ తేజ్ నటిస్తోన్న విరూపాక్ష చిత్రంలో నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ ఏప్రిల్ 21న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే గతంలో సంయుక్త షేర్ చేసిన ఆమె చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.