Tollywood: ఈ ఫోటోలోని అందాల ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టండి..

|

Apr 28, 2023 | 8:08 PM

పైన ఫోటోను చూడండి. అందులో ఉన్న ఆ అందాల తార ఎవరో గుర్తుపట్టండి. ఆమె ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. కథానాయికగానే కాదు.. స్పెషల్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇప్పుడు ఆ ముద్దుగుమ్మ నటించిన సినిమా త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతుంది. గుర్తుపట్టారా ? ఎవరో..

Tollywood: ఈ ఫోటోలోని అందాల ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టండి..
Actress
Follow us on

ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్ హీరోహీరోయిన్స్ వ్యక్తిగత విషయాలు తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. సినిమా అప్డేట్స్ కాకుండా.. వారి జీవితంలో ప్రేమ, పెళ్లి గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా స్టార్స్ చిన్ననాటి పిక్స్ తెగ వైరలవుతున్నాయి. అదే సమయంలో తారల అరుదైన ఫోటోస్ సైతం చక్కర్లు కొడుతున్నాయి. పైన ఫోటోను చూడండి. అందులో ఉన్న ఆ అందాల తార ఎవరో గుర్తుపట్టండి. ఆమె ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. కథానాయికగానే కాదు.. స్పెషల్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇప్పుడు ఆ ముద్దుగుమ్మ నటించిన సినిమా త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతుంది. గుర్తుపట్టారా ? ఎవరో.. తనే హీరోయిన్ డింపుల్ హయాతి.

డింపుల్ హయాతి.. 1988 ఆగస్ట్ 21న హైదరాబాద్ జన్మించింది. 2017లో గల్ఫ్ సినిమాతో సినీరంగంలోకి అరంగేట్రం చేసింది. 2019లో యురేక సినిమాలో నటించింది. ఆ తర్వాత వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ చిత్రంలో జర్రజర్ర అనే స్పెషల్ సాంగ్ చేసింది. ఇవే కాకుండా.. మాస్ మాహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటించిన ఖిలాడి చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా నటించింది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం డింపుల్ హయాతి రామబాణం చిత్రంలో నటించింది. ఇందులో మ్యాచో స్టార్ గోపిచంద్ ప్రధాన పాత్రలో నటించగా.. డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ మే 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే చిత్రప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.