- Telugu News Photo Gallery Cinema photos Actress Trisha beautiful Photos Goes Viral In Social Media telugu cinema news
Trisha: పాల సముద్రంలో దొరికిన దేవకన్య.. అందమే అసూయ పడేట్టుగా ఉన్న అందాల రాక్షసి..
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన త్రిష పేరే వినిపిస్తుంది. నిజమే మరీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 20 ఏళ్లైనా ఇప్పటికీ తరగని అందంతో కవ్విస్తోంది. ప్రభాస్ నటించిన వర్షం సినిమాతో తెలుగు పరిచయమైన త్రిష.. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.
Updated on: Apr 28, 2023 | 8:35 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన త్రిష పేరే వినిపిస్తుంది. నిజమే మరీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 20 ఏళ్లైనా ఇప్పటికీ తరగని అందంతో కవ్విస్తోంది.

ప్రభాస్ నటించిన వర్షం సినిమాతో తెలుగు పరిచయమైన త్రిష.. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది.

అయితే ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. తన వరకు వచ్చిన ప్రతి సినిమాను చేస్తూ ఇండస్ట్రీలో కొనసాగింది.

ఇక తాజాగా మణిరత్నం దర్శకత్వంలో త్రిష నటించిన పొన్నియన్ సెల్వన్ 2 సినిమా ఈరోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది.

ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా చిత్రయూనిట్ ప్రెస్ మీట్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలలో త్రిష మరింత అందంగా కనిపిస్తోంది.

హీరోయిన్ గా రెండు దశాబ్దాలుగా వెండితెరపై ప్రేక్షకులను అలరిస్తోన్న త్రిష.. ఇప్పటికీ 20 ఏళ్ల అమ్మాయిగా కనిపిస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

పాల సముద్రంలో దొరికిన దేవకన్య.. అందమే అసూయ పడేట్టుగా ఉన్న అందాల రాక్షసి..




