పైన ఫోటోలో ఉన్న ఆ చిన్నారి ఇప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో క్రేజీ హీరోయిన్. ఒకప్పుడు స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగిన సెలబ్రెటీ కూతురు. ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరూ హీరోహీరోయిన్స్ కావడం విశేషం. అయినా తన టాలెంట్…నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈ అమ్మడు. ఇటీవలే సూపర్ హిట్ చిత్రంలో కనిపించింది. అందులో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. అందం, టాలెంట్ ఎంత ఉన్నా. ఈ ముద్దుగుమ్మకు మాత్రం అవకాశాలు అంతగా రావడం లేదు. ఎవరో గుర్తుపట్టండి. తను మరెవరో కాదు.. స్టార్ హీరో రాజశేఖర్, జీవిత దంపతుల గారాలపట్టి శివాత్మిక.
2000 ఏప్రిల్ 22న జన్మించిన శివాత్మిక…. 2019 దొరసాని సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. ఆనంద్ దేవరకొండ నటించిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత ఆకాశం సినిమాలో కనిపించింది. అయితే అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నప్పటికీ ఈ అమ్మడుకు అవకాశాలు అంతగా రావడం లేదు.
ఈ ఏడాది పంచతంత్రం సినిమాతో థియేటర్లలో సందడి చేసింది. ఇక ఇటీవలే డైరెక్టర్ కృష్ణవంశి రూపొందించిన రంగమార్తండ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.