
ఇటీవల కొద్ది రోజులుగా చిన్ననాటి ఫోటోస్ సోషల్ మీడియాలో ఎక్కువగా వైరలవుతున్నాయి కదూ. సామాన్యుల ఫోటోస్ మాత్రమే కాదు.. సినీ తారల అరుదైన పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్, నాని, ప్రభాస్, నాగచైతన్య, కాజల్, సమంత, నయనతార వంటి స్టార్స్ చిన్ననాటి జ్ఞాపకాలు.. వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకునేందుకు నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే వారి చిన్ననాటి ఫోటోస్ కూడా తెగ షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నెట్టింట ఓ చిన్నోడి పిక్ చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోలో స్టైలీష్ గా కనిపిస్తున్నాడు చూడండి. ఆ చిన్నోడు ఎవరో గుర్తుపట్టండి. తెలుగు చిత్రపరిశ్రమలో అతను లవర్ బాయ్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తక్కువ సమయంలోనే స్టా్ర్ డమ్ సంపాదించుకున్నాడు. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి.. హీరోగా మెప్పించారు. ఎవరో గుర్తుపట్టండి.
స్టైల్ గా ఫోటోలకు ఫోజులిస్తున్న ఆ కుర్రాడు అందమైన ప్రేమకథలకు కేరాఫ్ అడ్రస్ లవర్ బాయ్ తరుణ్. ఒకప్పటి సీనియర్ హీరోయిన్ రోజారమణి కుమారుడే ఈ హీరో. అంజలి సినిమాతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి.. ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించాడు., దళపతి, ఆదిత్య 369, గౌరమ్మ , తేజ వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించాడు. అంజలి సినిమాలో తరుణ్ నటనకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు.
ఇక ఆ తర్వాత నువ్వే కావాలి సినిమాతో హీరోగా పరిచయమై.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ప్రియమైన నీకు.. నువ్వు లేక నేను లేను, చిరుజల్లు, అదృష్టం, నువ్వే నువ్వే వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో స్టార్ హీరోగా మారాడు. ఆ తర్వాత వరుస డిజాస్టర్స్ ఖాతాలో వేసుకున్న తరుణ్.. కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అంతేకాదు.. ప్రస్తుతం అతని వయస్సు 42సంవత్సరాలు. పెళ్లికి దూరంగానే ఉన్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.