Tollywood: ఈ ఫోటోలోని చిన్నోడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ టాప్ హీరో.. ఎవరో గుర్తుపట్టగలరా.?

|

Oct 05, 2024 | 11:00 AM

సోషల్ మీడియా పుణ్యమా అని మనకి తెలియని చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పైగా సినీ సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు తెగ దర్శనమిస్తున్నాయి.

Tollywood: ఈ ఫోటోలోని చిన్నోడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ టాప్ హీరో.. ఎవరో గుర్తుపట్టగలరా.?
Photo
Follow us on

సోషల్ మీడియా పుణ్యమా అని మనకి తెలియని చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పైగా సినీ సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు తెగ దర్శనమిస్తున్నాయి. ఏదైనా అకేషన్ వస్తే చాలు హీరోలు, హీరోయిన్లు వాళ్ల చిన్ననాటి ఫోటోలని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక తమకు ఇష్టమైన నటీనటుల ఫోటోలు ఆన్‌లైన్‌లో దొరికితే చాలు.. ఫ్యాన్స్ వాటిని తమ మొబైల్ స్క్రీన్ వాల్‌పేపర్స్‌గా సేవ్ చేసుకుంటుంటారు. తాజాగా నెట్టింట ఒక ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో ఉన్న చిన్నోడిని మీరు గుర్తుపట్టారా..? అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరో అయిపోయాడు. వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఒంటరిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి.. హీరోగా సక్సెస్ సాధించాడు. ఈ పాటికి మీకే అర్ధమై ఉంటుంది. అతడు మరెవరో కాదు నేచురల్ స్టార్ నాని.

నానికి తొలి చిత్రం ‘అష్టాచెమ్మా’తోనే నటుడిగా మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత వరుసగా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుని స్టార్ హీరో ఎదిగాడు. నేచురల్ యాక్టింగ్‌తో పక్కింటి కుర్రాడులా కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింతగా చేరువయ్యాడు. సినిమా క్లాస్ అయినా.. మాస్ అయినా.. ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేస్తాడు నాని. జెర్సీ, హాయ్ నాన్న, దసరా, సరిపోదా శనివారం.. ఇలా ఇటీవల బాక్సాఫీస్ దగ్గర వరుసగా సూపర్ హిట్స్ అందుకుని తన రేంజ్, ఇమేజ్‌ను మరింతగా పెంచుకున్నాడు. అలాగే నాని రాబోయే సినిమాలు కూడా సూపర్ హిట్స్ సాధించాలని అతడి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఒంటరిగా చూడటమే బెటర్.! ఓటీటీలో రచ్చ రచ్చ.. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి