Tollywood: ఈ బ్యాండు మేళం బ్యూటీని గుర్తు పట్టారా? పాన్ ఇండియా హీరోయిన్.. 42 ఏళ్లయినా నో పెళ్లి

|

Nov 07, 2024 | 9:28 AM

ఈ ఫొటోలోని సర్కిల్ లో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా? సన్నాయి పట్టుకుని కెమెరాలకు పోజులిచ్చిన ఈ అమ్మాయి ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.

Tollywood: ఈ బ్యాండు మేళం బ్యూటీని గుర్తు పట్టారా? పాన్ ఇండియా హీరోయిన్.. 42 ఏళ్లయినా నో పెళ్లి
Anushka
Follow us on

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ కాలం ఉంటుంది. పెళ్లి, పిల్లల తర్వాత హీరోలు సినిమాలు చేస్తారేమో కానీ చాలామంది హీరోయిన్లు ఇండస్ట్రీకి దూరమైపోతారు. ఇంకొందరు హీరోయిన్లు మాత్రం పెళ్లి వయసు వచ్చినా ఆ మూడు ముళ్ల బంధానికి దూరంగా ఉంటున్నారు. నాలుగు పదులు దాటినా వరుసగా సినిమాలు చేస్తుంటారు. పై ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్ కూడా సరిగ్గా ఈ కోవకే చెందుతుంది. ఈ అందాల తార వయసు సుమారు 42 ఏళ్లకు పైగానే. అయినా దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా వెలుగొందుతోంది. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిందీ ముద్దుగుమ్మ. సినిమాలతో పాటు నిత్యం పెళ్లి రూమర్లతోనూ వార్తల్లో నిలుస్తోన్న ఈ సొగసరి ఎవరో ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది. యస్. ఈ క్యూటీ మరెవరో కాదు మన స్వీటీ అనుష్కా శెట్టి. గురువారం (నవంబర్ 07) ఆమె పుట్టిన రోజు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ ముద్దుగుమ్మకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇదే క్రమంలో స్వీటీకి సంబంధించిన చిన్ననాటి ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనుష్క. ఆ తర్వాత తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించింది. పీరియాడికల్ డ్రామాలు, సస్పెన్స్ థ్రిల్లర్‌ల నుండి యాక్షన్-ప్యాక్డ్ పాత్రలు, అలాగే రొమాంటిక్ కామెడీల వరకు ఇలా అన్ని జానర్ల సినిమాలతో ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేసింది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ అద్భుతంగా నటించింది అనుష్క. అరుంధతి సినిమాలో జేజమ్మగా జేజేలు కొట్టించుకున్న స్వీటీ భాగమతి, రుద్రమదేవి, బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. ఆ మధ్యన కొద్దిగా గ్యాప్ తీసుకున్నప్పటికీ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చిందీ అందాల తార.

ఇవి కూడా చదవండి

అనుష్కా శెట్టి లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

అనుష్క శెట్టి ప్రస్తుతం ఒక తెలుగు, ఒక మలయాళ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఇప్పుడు పుట్టినరోజు సందర్భంగా ఒక అప్‌డేట్ అందుతోంది. క్రిష్ దర్శకత్వంలో ఆమె నటిస్తున్న చిత్రం ‘ఘాటి’. ఇవాళ దీనికి సంబంధించి అప్డేట్ రాబోతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.