Tollywood:ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? పుట్టుకతోనే కోటీశ్వరురాలు.. తనకంటే 16 ఏళ్ల పెద్ద హీరోతో పెళ్లి

సినిమా ఇండస్ట్రీలో వీరి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి కుటుంబం నుంచే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల తార ఓ హీరోతో ప్రేమలో పడింది. ఆ తర్వాత పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత..

Tollywood:ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? పుట్టుకతోనే కోటీశ్వరురాలు.. తనకంటే 16 ఏళ్ల పెద్ద హీరోతో పెళ్లి
Bollywoood Actress

Updated on: Jul 09, 2025 | 8:07 PM

పై ఫొటోలో క్యూట్ గా ముద్దుగా ఉన్న ఈ పాపను చూశారా? ఈమె ఓ క్రేజీ హీరోయిన్. పుట్టుకతోనే సుసంపన్నురాలు. తండ్రి ప్రముఖ నటుడు, నిర్మాత కూడా. ఇక ఈమె నానమ్మ అయితే హిందీ సినిమాల్లో స్టార్ హీరోయిన్. తన అందం, అభినయంతో బాలీవుడ్‌ని ఒక ఊపు ఊపేసింది. ఇంత పెద్ద సినీ నేపథ్యం ఉన్నా సొంత ప్రతిభతో సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు సొంతం చేసుకుందీ అందాల తార. మొదట కొన్ని సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ్ సినిమాల్లోనూ కథానాయికగా అలరించింది. సూర్య, శింబు, ఆర్య, పునీత్ రాజ్ కుమార్, జయం రవి, కార్తీ తదితర స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఇదే సమయంలో తనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడింది. పెద్దల అంగీకారంతో అతనితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే గతంలో మాదిరిగా సినిమాల్లో నటించడం లేదీ అందాల తార. అడపా దడపా మాత్రమే సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తోంది. మరి ఈ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు సయేషా సైగల్.

బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్, నటి సైరా బాను ల మనవరాలైన సయేషా గజినీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. ఆ తర్వాత అఖిల్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. శివాయ్, గజనీకాంత్ తదితర తమిళ్,హిందీ సినిమాల్లో కథానాయికగా మెప్పించింది. ఇదే సమయంలో తన తోటి హీరో ఆర్యతో ప్రేమలో పడింది. ఆ తర్వాత ఇరు పెద్దల అంగీకారంతో 2019లో పెళ్లిపీటలెక్కారు. ప్రస్తుతం ఈ దంపతులకు ఒక ముద్దుల కూతురు ఉంది.

ఇవి కూడా చదవండి

భార్య, బిడ్డలతో హీరో ఆర్య..

 

కాగా సయేషా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటోంది. అలాగే తన ముద్దుల కూతురి ఫొటోలను కూడా అందులో పంచుకుంటోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .