Tollywood: క్రిస్మస్ తాతగా మారిపోయిన టాలీవుడ్ క్రేజీ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ పర్వదినాన్ని ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక టాలీవుడ్ హీరో కూడా క్రిస్మస్ తాతాలా మారిపోయాడు. శాంతా క్లాజ్ వేషం వేసుకుని సర్ ప్రైజ్ ఇచ్చాడు.
‘క్రిస్మస్’ అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది శాంతా క్లాజ్. ముఖ్యంగా పిల్లలు ఈ క్రిస్మస్ తాతను బాగా ఇష్టపడతారు. తమకు నచ్చిన బహుమతులు తీసుకొస్తాడన్నది వారి నమ్మకం. అలా క్రిస్మస్ పర్వదినాన ఓ టాలీవుడ్ క్రేజీ హీరో కూడా క్రిస్మస్ తాతలా మారిపోయాడు. శాంటాక్లాజ్ వేషం వేసుకుని పిల్లలకు బహుమతులిచ్చాడు. పై ఫొటో అదే. మరి ఈ క్రిస్మస్ లుక్ లో ఉన్న ఆ హీరో ఎవరో గుర్తు పట్టారా? అంతా సవ్యంగా జరిగి ఉంటే ఈ క్రిస్మస్ కు ఈ క్రేజీ హీరో సినిమా ఒకటి రిలీజ్ అవ్వాల్సింది. అయితే అనివార్య కారణాలతో ఆ మూవీ కాస్తా వాయిదా పడింది. అందుకే ఆడియెన్స్ ను నిరాశపర్చకుండా ఇలా శాంతాక్లాజ్ లుక్ లో దర్శనమిచ్చాడీ టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో. ఈ క్రిస్మస్ తాత మరెవరో కాదు యూత్ స్టార్ నితిన్. వెంకీ కుడుముల దర్శకత్వంలో అతను నటిస్తోన్న తాజా చిత్రం రాబిన్ హుడ్. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ఇవాళ విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాలతో విడుదల వాయిదా పడింది. అందుకే అభిమానుల్లో జోష్ నింపేందుకు రాబిన్ హుడ్ టీమ్ ఇలా శాంటాక్లాజ్ లుక్ లో ఉన్న నితిన్ ఫొటోను ఒకటి విడుదల చేశారు. ఇందులో క్రిస్మస్ తాత గెటప్పులో గిఫ్టులు పంచుతున్నాడు యూత్ స్టార్. ఈ పోస్టర్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
పుష్ప 2 నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ అధినేతలు నవీన్ యేర్నేని, యలమంచిలి రవి శంకర్ రాబిన్ హుడ్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నటకిరిటీ రాజేంద్రప్రసాద్ ఏజెంట్ జాన్ స్నో పాత్రలో సందడి చేయనున్నాడు. జీవీ ప్రకాశ్ కుమార్ స్వరాలు సమకూర్చారు. కాగా రాబిన్ హుడ్ సినిమాను 2025 ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. రిలీజ్ డేట్ పై ఇంకా మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
రాబిన్ హుడ్ నుంచి నితిన్ కొత్త పోస్టర్..
Merry Christmas from Team #Robinhood 🎄
Ho ho ho 🎅 Our Santa will deliver entertainment on the big screens soon ❤🔥
Enjoy the festival. Enjoy the holidays season. @actor_nithiin @sreeleela14 @VenkyKudumula @gvprakash @MythriOfficial @SonyMusicSouth pic.twitter.com/9gCYuPt8Gf
— BA Raju’s Team (@baraju_SuperHit) December 25, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.