Tollywood: ఈ పిల్లాడిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో.. వరుసగా 14 ఫ్లాప్‌లొచ్చినా నిలబడ్డాడు

వరుసగా రెండు, మూడు సినిమాలు ప్లాఫ్ అయితేనే డీలా పడిపోతుంటారు హీరోలు. అలాంటిది వరుసగా 14 ప్లాఫ్‌లు ఎదురైతే ఆ హీరో పరిస్థితి దారుణం. కానీ ఈ హీరో మాత్రం గోడకు కొట్టిన బంతిలా, పడిలేచిన కెరటంలా మళ్లీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. క్రేజీ హీరోగా అభిమానుల మన్ననలు అందుకుంటున్నాడు

Tollywood: ఈ పిల్లాడిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో.. వరుసగా 14 ఫ్లాప్‌లొచ్చినా నిలబడ్డాడు
Tollywood Actor

Updated on: Nov 11, 2024 | 6:03 PM

పై ఫొటోలో అమ్మతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ పిల్లాడిని గుర్తు పట్టారా? ఇప్పుడు ఈ బుడ్డోడు టాలీవుడ్ లో క్రేజీ హీరో. 2002లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ప్రేమకథా చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు. అనతి కాలంలోనే యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే చాలామంది హీరోల్లాగే యాక్షన్ సినిమాల వైపు దృష్టిసారించాడు. ఫలితంగా వరుస వైఫల్యాలు ఎదుర్కొన్నాడు. సిక్స్ ప్యాక్ లు ట్రై చేసినా సక్సెస్ మాత్రం దరిచేరలేదు. ఒకటి కాదు రెండు కాదు ఈ హీరో నటించిన ఏకంగా 14 సినిమాలు బోల్తా కొట్టాయి. సాధారణంగా వేరే హీరోలైతే సినిమా ఇండస్ట్రీని విడచిపెట్టేవారు. కానీ ఈ నటుడు మాత్రం గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చాడు. కెరీర ప్రారంభంలో తనకు క్రేజ్ తీసుకొచ్చిన ప్రేమకథలతోనే మళ్లీ విజయాల బాట ఎక్కాడు. మళ్లీ వరుసగా సక్సెస్ లు సొంతం చేసుకున్నాడు. దీంతో ఈ హీరో ఇక వెనుదిరిగిచూసుకోవాల్సిన అవసరం రాలేదు. మరి ఈ హీరో ఎవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది. యస్.. తను మరెవరో కాదు యూత్ స్టార్ నితిన్‌. ఇది అతని చిన్ననాటి ఫొటో. అందులో తనతో ఉన్నది వాళ్ల అమ్మ.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో..

యూత్ స్టార్ నితిన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. గతేడాది అతను నటించిన ఎక్స్ ట్రార్డినరి సినిమా యావరేజ్ గా నిలిచింది. అంతకు ముందు మాచర్ల నియోజకవర్గం ప్లాఫ్‌ గా నిలిచింది. దీంతో ఇప్పుడు సక్సెస్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నాడీ హీరో. ఇందులో భాగంగానే వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం తనకు భీష్మ లాంటి సూపర్ హిట్ సినిమాను అందించిన వెంకీ కుడుములతో కలిసి రాబిన్ హుడ్ సినిమాను చేస్తున్నాడు నితిన్. ఇందులో లేటెస్ట్ సెన్సేషన్, డ్యాన్సింగ్ క్వీన్  శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే తమ్ముడు అనే మరో మూవీలోనూ హీరోగా నటిస్తున్నాడీ క్రేజీ హీరో. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇవి కూడా చదవండి

భార్య షాలినీతో హీరో నితిన్..

 

నితిన్, షాలినీల రొమాంటిక్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.