సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతుల మీదుగా మెడల్ అందుకుంటోన్న ఈ పిల్లాడిని గుర్తు పట్టారా? దేశం గర్వించదగ్గ గొప్ప నటుడు

|

Sep 05, 2024 | 5:01 PM

సర్వేపల్లి రాధాకృష్ణన్ కు సంబంధించిన పాత ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. అందులో సర్వేపల్లితో పాటు ఒక దక్షిణాది ప్రముఖ నటుడు ఉండడం విశేషం. ఛైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలెట్టిన ఆ పిల్లాడు ఇప్పుడు భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటుల్లో ఒకడు. ఎన్నో వందల సినిమాల్లో తన అద్భుతమైన నటనతో ఆడియెన్స్ మనసులు గెల్చుకున్నారాయన.

సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతుల మీదుగా మెడల్ అందుకుంటోన్న ఈ పిల్లాడిని గుర్తు పట్టారా? దేశం గర్వించదగ్గ గొప్ప నటుడు
Sarvepalli Radhakrishnan
Follow us on

భారత మొదటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఏటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొంటున్నారు. అందరూ తమ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దిన గురువులకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ కు సంబంధించిన పాత ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. అందులో సర్వేపల్లితో పాటు ఒక దక్షిణాది ప్రముఖ నటుడు ఉండడం విశేషం. ఛైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలెట్టిన ఆ పిల్లాడు ఇప్పుడు భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటుల్లో ఒకడు. ఎన్నో వందల సినిమాల్లో తన అద్భుతమైన నటనతో ఆడియెన్స్ మనసులు గెల్చుకున్నారాయన. తెలుగులోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆయన నటనకు అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి నటించడం ఆయనకు మాత్రమే సాధ్యం. అందుకే విశ్వ నటుడిగా మన్ననలు అందుకుంటున్నారు. ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్ ఆ పిల్లాడు మరెవరో కాదు లోక నాయకుడు కమల్ హాసన్. సర్వేపల్లి జయంతి సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. అందులో పై ఫొటో కూడా ఉంది.

బాలనటుడిగా పలు సినిమాల్లో నటించి మెప్పించారు కమల్ హాసన్. నాలుగేళ్ల వయసులోనే ఆయన కలత్తూర్ కణమ్మ అనే సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించారు. ఇందుకు గానూ ఆయనకు రాష్ట్రపతి మెడల్ లభించింది. దీంతో అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ కమల్ హాసన్ కు స్వయంగా బంగారు పతకాన్ని అందించారు. ఫై ఫొటో అదే. కమల్ హాసన్ ఇటీవల నటించిన భారతీయుడు 2 సినిమా అభిమానులను పూర్తిగా నిరాశపర్చింది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీ మొదటి పార్ట్ మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయింది. అదే సమయంలో ప్రభాస్ తో కలిసి కమల్ నటించిన కల్కి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.  ఇందులో ఆయన పోషించిన సుప్రీం యాస్కిన్ పాత్రకు మంచి ప్రశంసలు వచ్చాయి. కల్కి రెండో పార్ట్ లో కమల్ హాసన్  పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉండనుందని సమాచారం.

ఇవి కూడా చదవండి

 

నాలుగేళ్ల వయసులోనే రాష్ట్రపతి చేతుల మీదుగా  గోల్డ్ మెడల్ అందుకుంటోన్న నటుడు కమల్ హాసన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.