ఈ ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా? ఢిల్లీకి చెందిన ఈ పాన్ ఇండియా హీరోయిన్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇంజనీరింగ్ చదివింది. మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. కానీ నటనమీద ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అన్నట్లు ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయమైంది. అది కూడా ఓ స్టార్ హీరో సినిమాతో. ఆ తర్వాతే బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు సొంతం చేసుకుంది. ఇక గత కొన్ని రోజులుగా తన పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపిస్తోంది. అందుకు కారణం ఆమె నటించిన ఒక పాన్ ఇండియా సినిమా. ఈపాటికే అర్థమై ఉంటుంది.. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో.. యస్. ఆమె మరెవరో కాదు ‘ఆదిపురుష్’ నటి కృతిసనన్.
ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ఆదిపురుష్ మరికొన్ని గంటల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. రామాయణం మహా కావ్యం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా, జానకిగా కృతి కనిపించనున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటించారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా రిలీజయ్యాక ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.